ఐఏఎస్ శ్రీలక్ష్మి కి సుప్రీంలోనూ చుక్కెదురు : పిటీషన్ కొట్టివేత - విచారణ కంటిన్యూ..వాట్ నెక్స్ట్..!!
ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి..ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీం కోర్టు సైతం కొట్టివేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదానికి సంబంధించి సీఆర్‌పీసీ సెక్షన్ 173 ప్రకారం సీబీఐ తుది నివేదిక ఇచ్చే వరకు తనపై నమోదైన కేసుల విచారణను నిలిపివేయాల్సిందిగా హైదరాబాద్‌లోని సీబీఐ ప్రిన్సిపల్ జడ్జిని ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది.

హైకోర్టు కొట్టివేయటంతో సుప్రీంలో..
గతంలో ఇదే అభ్యర్థనతో శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో..శ్రీలక్ష్మీ సుప్రీంను ఆశ్రయించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఓఎంసీ కేసులో ఇప్పటి వరకు సీబీఐ నాలుగు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిందని , ఆ తరువాత అకస్మాత్తుగా సెక్షన్ 173 ప్రకారం తుది నివేదిక అవసరం లేదని పత్రాలు దాఖలు చేసిందని తెలిపారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం ఈ కేసులో తొమ్మిదేళ్లు గడిచినా అభియోగాలు నమోదు చేయలేదు. దర్యాప్తు పూర్తయింది.

శ్రీలక్ష్మీ పిటీషన్ కొట్టివేత
కాబట్టి సెక్షన్ 173 ప్రకారం నివేదిక అవసరం లేదని సీబీఐ దాఖలు చేసిన పత్రాల్లో ఉందని వ్యాఖ్యానించింది. కేసు స్వీకరించే సమయంలో జారీ చేసిన నోటిఫికేషన్ లో సరిహద్దు వివాదం గురించి సీబీఐ ప్రస్తావించిందని..కానీ, కేవలం ఓఎంసీ పై మాత్రమే దర్యాప్తు జరిగిందని రంజిత్ కుమార్ అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదని, ఆ వివాదం పరిష్కారమైతే ఎంత మొత్తంలో మైనింగ్ జరిపారో స్పష్టత వస్తుందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.

శ్రీలక్ష్మీ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు
ఇక, తెలంగాణ కేడర్ ను ఎలాట్ అయిన శ్రీలక్ష్మీ ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏపీ కేడర్ కు మార్పు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. సీఎం జగన్ సైతం తన ప్రభుత్వంలో శ్రీలక్ష్మికి ప్రాధాన్యత ఇచ్చారు. రెండు సార్లు ప్రమోషన్ పొందిన శ్రీలక్ష్మీకి కీలకమైన పురపాలక శాఖ అప్పగించారు.
ఇక, ఇప్పుడు సుప్రీంకోర్టు సైతం విచారణ నినలిపివేయాలంటూ చేసిన అభ్యర్ధన ను కొట్టివేయటంతో ఇప్పుడు శ్రీలక్ష్మీ తరువాతి అడుగులు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ హాయంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు.. జారీ చేసిన జీవోల విషయంలో శ్రీలక్ష్మీ మీద అభియోగాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications