ఆంధ్రాలో ఇసుక అక్రమ మైనింగ్, గత ప్రభుత్వం తీరుపై సుప్రీం కోర్టు అసహనం
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అధికారుల తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై హరిత టైబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జేపీ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించింది.
ఈ సందర్భంగా సుప్రీం కోర్టు పలు అంశాలను లేవనెత్తింది. షోకాజ్ నోటీసులు, ఎఫ్ఐఆర్ లు అన్నీ ఇదే ఏడాది జులై, ఆగస్టులోనే ఎందుకు ఉన్నాయని, షోకాజ్ నోటీసులు అన్నీ ఓకే తరహాలో ఉండటంపై సుప్రీం కోర్టు అసహనంవ్యక్తం చేసింది. మేము గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా జులై, ఆగస్టు నెలల్లోనే షోకాజ్ నోటీసులు జారీ చేయడంలో ఎందుకు తాత్సార్యం చేశారని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు.

ఇప్పటి వరకు 9 మందిపై కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అక్రమ మైనింగ్ వ్యవహారం దాదాపు అరికట్టామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు చెప్పారు. తాము ఎక్కడా అక్రమ మైనింగ్ పాల్పడలేదని, ఈ వ్యవహారంపై తమపై ఎక్కడా కేసులు నమోదు కాలేదని జేపీ పవర్ వెంచర్స్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు చెప్పారు. అయితే మైనింగ్ చేసిన తర్వాత తప్పకకుండా సమాధానం ఇవ్వవలసిందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం జేపీ పవర్ వెంచర్స్ కు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో తాము ఇప్పటికీ నోటీసులు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టుకు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో మైనింగ్ వ్యవహారంపై అన్ని రకాల ఉల్లంఘనలు జరిగాయని న్యాయవాది నాగేంద్ర కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హరిత ట్రైబ్యునల్ జేపీ పవర్ వెంచర్స్ కు భారీ జరిమానా విధించింది. హరిత ట్రైబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జేపీ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మైనింగ్ నిలుపుదల చేయాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటూ నవంబర్ 14వ తేదీ లోపు తాజా నివేదిక దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ నవంబర్ 18వ తేదీకి వాయిదా పడింది. గత వైసీపీ ప్రభుత్వంలో జేపీ పవర్ వెంచర్స్ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలలో ఇసుక వ్యాపారం చేసిన విషయం తెలిసిందే జేపీ పవర్ వెంచర్స్ సంస్థ గనుల శాఖ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఇసుక వ్యాపారం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే జేపీ పవర్ వెంచర్స్పై ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
-
జగన్ మరో మెడికల్ కాలేజీల తరహా వార్నింగ్..!! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications