TTD: శ్రీవారి భక్తులకు అరుదైన ఛాన్స్ - దర్శనాలపై టీటీడీ తాజా నిర్ణయం..!!

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో కీలక ఘట్టాలకు రంగం సిద్దమైంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు నిర్ణయించారు. ఈ దర్శనాలకు సంబంధించి టోకెన్లు జారీ చేయనున్నారు. ఇదే సమయంలో జనవరి 7వతేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాల కోసం ఆన్ లైన్ టికెట్లు 40 నిమిషాల్లోనే పూర్తి అయ్యాయి. ఇక, ఈ దర్శనాల కోసం ఆఫ్ లైన్ టికెట్ల రాజీ పైన టీటీడీ ప్రకటన చేసింది. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలవేళ జనవరి 7వతేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. సాధా రణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జనవరి 7వ ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.

The Tirumala Srivari temple cleansing fete Koil Alwar Tirumanjanam will be observed on January 07

బ్రేక్ దర్శనాలు రద్దు
ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజలు, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంత‌రం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

దర్శనం టోకెన్లు
జనవరి 7వ తేది కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో 6వ తేది సిఫార్సు లేఖలు స్వీకరించరని టీటీడీ వెల్లడించింది. ఇక, వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబం ధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు చేస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఈవో తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజులలో శ్రీవారి దర్శనం ఉండదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+