తిరుమలలో బోటింగా?- క్లారిటీ ఇచ్చిన అధికారులు

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు 58,358 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,024 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.45 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 18 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

The Tirupati DFO clarified about the boating incident in Papavanasanam Dam in Tirumala

కాగా- తిరుమలలో పవిత్రమైన పాపవినాశనం రిజర్వాయర్‌లో బోటింగ్ నిర్వహించారనే సమాచారం కలకలం రేపింది. శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చే వేలాదిమంది భక్తుల కోసం దీన్ని ప్రవేశపెట్టారని, పాపవినాశనంలో ఇకపై బోటింగ్ చేయవచ్చనే వార్తలు దుమారం రేపాయి.

మున్ముందు- తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం ఇక పర్యాటక కేంద్రంగా మారుతుందనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. తిరుమల, పాపవినాశనం, గోగర్భం, కుమారధార-పసుపుధార.. వంట తీర్థలు పర్యాటక నిలయాలుగా మారుతాయని, ఇది అక్కడి పవిత్రతను దెబ్బతీయవచ్చంటూ కొందరు భక్తులు సోషల్ మీడియా వేదకగా ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్, శేషాచలం బయోస్ఫేర్ రిజర్వ్‌ పరిధిలో ఉన్న పాపవినాశనంలో బోటింగ్ నిర్వహించడం నిబంధనలకు సైతం విరుద్ధమని తెలిపారు. ఈ వార్తలపై తిరుపతి జిల్లా అటవీ అధికారి పీ వివేక్ స్పందించారు. స్పష్టత ఇచ్చారు. తిరుమలలోని పాపవానాశనం డ్యామ్ లో బోటింగ్ పై జిల్లా అటవీశాఖ అధికారి శ్రీ పి.వివేక్ స్పష్టత ఇచ్చారు.

Take a Poll

ఈ సమాచారం అందడంతో మంగళవారం ఉదయం పాపవినాశనం డ్యామ్ చుట్టూ పడవలతో తనిఖీలు నిర్వహించామని అన్నారు. పాపవినాశనం డ్యామ్‌లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో తనిఖీ చేయడానికి ఈ పడవలను ఉపయోగించామని తెలిపారు. తనిఖీలకు వినియోగించిన సంబంధిత పడవలను ఇప్పటికే వెనక్కి తీసుకొచ్చామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+