తెలుగు రాష్ట్రాల్లో వరదల దెబ్బకు భారీ నష్టం, అమిత్ షా చేతికి నివేదిక, ఎంత ఇస్తారో ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని మనవి చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనవి మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల పర్యటించారు.
తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై సంబంధిత అధికారులతో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం నిర్వహించి వారితో జరిగిన నష్టంపై చర్చలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో అధికారులు వరదల కారణంగా ఎంత నష్టం జరిగిందో అంటూ ఒక నివేదికను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అందించారు.

తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ వేదిక తయారు చేసి కేంద్ర హోం శాఖ మంత్రి అమీషాకు బుధవారం అందజేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుధవారం ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. కేంద్ర బృందాలు వరద ప్రాంతాల్లో పరిశీలిస్తాయని, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం నుండి ఆర్థిక సహాయం అందుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోస్ట్ చేశారు.
ఇటీవల రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పర్యటించిన శివరాజ్ సింగ్ చౌహన్ అధికారులతో చర్చించి వరద నష్టంపై అంచనా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఎంత నష్టం జరిగింది అనే విషయంపై అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత ఢిల్లీ వెళ్లారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని త్వరలో తాను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తానని రెండు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటుందని అప్పట్లోనే కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మీడియాకు చెప్పారు. శివరాజ్ సింగ్ చౌహాన్ నివేదిక ఆధారంగా, తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు పర్యటించిన తర్వాత ఆ నివేదిక పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం చేస్తుందని సంబంధిత ఉన్నతాధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications