జగన్ పై దాడి, టీడీపీ సెల్ఫ్ గోల్ - ప్రధాని స్పందనతో..!!

జగన్ పై దాడి వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా దుమారానికి కారణమవుతోంది. జగన్ పైన దాడి గురించి జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ప్రధాని మోదీతో సహా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్ స్పందించారు. దాడి తరువాత టీడీపీ నేత నారా లోకేష్, పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఎకౌంట్ లోనూ ఇది వైసీపీ కావాలనే చేస్తోందంటూ పోస్టింగ్స్ చేసారు. ఇది బూమ్ రాంగ్ అయింది.

టీడీపీ నేతల పోస్టింగ్స్
టీడీపీ నేత నారా లోకేష్ తో సహా ఐ టీడీపీ, తెలుగు దేశం సోషల్ మీడియా హ్యాండిల్స్ లో జగన్ పైన దాడి గురించి ప్రచారం చేసారు. జగన్ పై దాడి డ్రామాగా.. ఉద్దేశ పూర్వక డ్రామాగా పేర్కొన్నారు. 2019 లో జరిగిన ఘటన గురించి టీడీపీ చేసిన ప్రచారానికి కొనసాగింపుగా ఈ ఘటనటను వాడుకొనే ప్రయత్నం చేసారు. జాతీయ మీడియాలోనూ ఏపీ ముఖ్యమంత్రి పైన దాడి జరిగిందంటూ కధనాలు వచ్చాయి. ప్రధాని మోదీ స్పందించారు. జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ స్పందించారు.

The YSRCP accused political rival TDP supremo Chandrababu Naidu of orchestrating the attack

ప్రధాని స్పందనతో
రాజకీయ విభేదాలు ఉన్నా, దాడులు సరి కాదని స్టాలిన్ పేర్కొన్నారు. పరోక్షంగా జగన్ పైన జరిగింది రాజకీయ దాడిగా చెప్పుకొచ్చారు. అప్పటికే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఇది కావాలని వైసీపీ నేతలే చేసారంటూ విమర్శలు ప్రారంభించారు. తగిలింది గలకరాయి అంటూ వ్యాఖ్యానించారు. ఇంతో ప్రధాని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించటంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించక తప్పలేదు. లోకేష్, అచ్చెన్నాయుడు వంటి వారు పోస్టింగ్స్ వైరల్ అయ్యాయి. ఆ సమయంలో చంద్రబాబు దాడిని ఖండిస్తూ ట్వీట్ చేసారు. కానీ, పార్టీ నేతలు మాత్రం ఈ దాడి వైసీపీనే కావాలని చేసుకున్నట్లుగా విమర్శలు కొనసాగిస్తున్నారు.

చంద్రబాబు అలా..పార్టీ ఇలా
జగన్ పైన దాడి తరువాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. ప్రధాని కూడా స్పందించటంతో ఏదో తేడా వచ్చేలా ఉందని చంద్రబాబు స్పందించాల్సి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అయితే, జగన్ పైన దాడి ప్రజలు గమనించారని..ఎన్నికల్లో బుద్ది చెబుతారని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటన పైన ఎన్నికల సంఘం నివేదిక కోరింది. విజయవాడ నగర కమిషనర్ కాంతి రాణా నుంచి ప్రాధమిక సమాచారం సేకరించింది. ఎన్నికల ప్రచారం చేసే ముఖ్య నేతల భద్రత విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇప్పుడు జగన్ పైన దాడి వ్యవహారం జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+