తిరుమ‌ల ఆల‌యంలోని శ్రీ‌వారి హుండీలో చోరీ.. సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు..

క‌ళియుగ వైకుంఠ దైవ‌మైన శ్రీ వెంక‌టేశ్వ‌రస్వామి ఆల‌యంలోని హుండీలో చోరి జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి హుండీలోని నగదును ఓ యువకుడు దొంగిలించాడు. ఈ చోరీ దృశ్యాలు ఆల‌యంలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీని ఆధారంగానే ఆల‌య భ‌ద్ర‌తా సిబ్బంది నిందితుడిని ప‌ట్టుకున్నారు.

శ్రీ‌వారి ఆల‌యంలో నవంబర్ 23వ తేది మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్టీల్ హుండీలో నగదును ఓ యువ‌కుడ‌ దొంగలించే ప్రయత్నం చేశాడు. ఆ నేప‌థ్యంలో హుండీలోని కొంత నగదును తస్కరించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ త‌తంగ‌మంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో ఈ విషయాన్ని ప‌రిశీలించిన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని గుర్తించారు.

Theft in Tirumala temple Scenes in CCTV footage

రూ. 15వేలు దొంగ‌త‌నం..

పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆ యువ‌కుడి కోసం భ‌ద్ర‌తా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అదే రోజు సాయంత్రం 6.00 గంటలకు ఆ యువకుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆ యువ‌కుడిని భద్రతా సిబ్బంది కార్యాలయానికి తరలించారు. విచారణ చేప‌ట్టగా, ఈ నేప‌థ్యంలో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు.

అతడి వద్ద నుంచి 15వేల రూపాయ‌లను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆల‌యంలో చోరికి గుర‌యిన వ్య‌క్తిని త‌మిళ‌నాడుకు చెందిన వేణులింగంగా గుర్తించారు. అతడు శంకరన్ కోవిల్ నివాసి అని వివరించాడు. అనంత‌రం ఆ యువ‌కుడిని పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగ‌వంతం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+