ముసుగులతో వచ్చారు.... మహిళని బెదిరించి దోచుకెళుతూ...ఆ పై పెనుగులాట
పాతగుంటూరు ప్రాంతంలోని సత్యనారాయణ గుడి వీధిలో ఘరానా దోపిడీ జరిగింది. చీర ఫాల్స్ కొనుగోలు చేస్తామంటూ భార్యాభర్తలుగా ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఒంటరిగా ఉన్న సువర్ణలక్ష్మి .
గుంటూరు: పాతగుంటూరు ప్రాంతంలోని సత్యనారాయణ గుడి వీధిలో ఘరానా దోపిడీ జరిగింది. చీర ఫాల్స్ కొనుగోలు చేస్తామంటూ భార్యాభర్తలుగా ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఒంటరిగా ఉన్న సువర్ణలక్ష్మి అనే మహిళలను బెదిరించి 15 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
మహిళ ముఖానికి స్కార్ఫ్ కట్టుకోగా.. మరో వ్యక్తి మాస్కు ధరించినట్లు బాధితురాలు చెబుతోంది. దోపిడీ అనంతరం వారిద్దరూ ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు యత్నించగా సువర్ణలక్ష్మి అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఈ పెనుగులాటలో ఆమెకు గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న గుంటూరు తూర్పు డీఎస్పీ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. దుండగులు ఇంట్లోకి రావడం.. పారిపోతున్న వారిని సువర్ణలక్ష్మి అడ్డుకోవడం సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.సీసీ కెమెరాల పుటేజీ ని పోలీసులు పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications