మరో వివాదంలో పెద్దాయన, పెద్దిరెడ్డి బంగ్లాకు ప్రజల డబ్బుతో సీసీ రోడ్లు, టీడీపీ, జనసేన
వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదు సంవత్సరాల పాటు వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూగా ఓ వెలుగు వెలిగిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి చిత్తూరు జిల్లాతో పాటు కొన్ని జిల్లాల్లో ఎదురే లేదు అనే విషయం తెలిసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పడిపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దిరెడ్డి పరిస్థితి తారుమారు అవుతోంది.
తిరుపతి సిటీలోని ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోన రాయల్ నగర్ లో సుమారు మూడు ఎకరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇంటిని నిర్మించారని అంటున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతిలో అదే ఇంటిలో నివాసం ఉంటున్నారు. తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం ఉంటున్న బంగ్లా భూములు మఠం భూములు అని, గతంలో ఆ భూములను ఆయన కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి.

తిరుపతిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నివాసం ఉంటున్న ఇంటికి ప్రజల సొమ్ముతో సీసీ రోడ్డు (సిమెంట్ రోడ్డు) వేయించుకున్నారని, సామాన్య ప్రజలు ఆ రోడ్డులో తిరగకుండా రోడ్డుకు రెండు వైపుల గేట్లు పెట్టారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇంటి వరకు వేసిన రోడ్డుకు తిరుపతి కార్పోరేషన్ డబ్బులు ఖర్చు చేశారా, లేదా ? అని రికార్డులు చూసి చెబుతామని తిరుపతి కార్పోరేషన్ అధికారులు అంటున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి కార్పోరేషన్ అధికారులు సుమారు రూ. 18 లక్షలు ఖర్చు చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వరకు సీసీ రోడ్లు వేశారని, ఆయితే ఆ రోడ్డులో సామాన్య ప్రజలు ఎవ్వరూ తిరగకుండా రెండు వైపుల గేట్లు పెట్టించిన కార్పోరేషన్ అధికారులు అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి పూర్తిగా సహకరించారని టీడీపీ, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఎవ్వరూ ఆరోడ్డుకు ఇరు వైపుల ఉన్న గేట్లు తియ్యాలని చెప్పడానికి భయపడ్డారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తరువాత ఆ రోడ్డుకు ఇరువైపుల ఏర్పాటు చేసిన గేట్లు తొలగించాలని ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు చెబుతున్నా కార్పోరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పెద్దిరెడ్డి ఇంటి వరకు కార్పోరేషన్ డబ్బుతో రోడ్లు వేశారా, లేదా ? అని రికార్డులు చూసి చెబుతామని కార్పోరేషన్ అధికారులు అంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగితే పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి బలవంతంగా తరిమేశారని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. టీడీపీ, జనసేన నాయకుల ఆరోపణలు గమనిస్తే తిరుపతి రాయల్ నగర్ లోని బుగ్గమఠం భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అందులో మూడు ఏకరాల్లో పెద్ద బంగ్లా కట్టుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

గతంలో పంచాయితీగా ఉన్న ఆ ప్రాంతం తరువాత తిరుపతి కార్పోరేషన్ లో కలిసిపోయింది. రాయల్ నగర్ పంచాయితీలో ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో మట్టిరోడ్డు ఉండేదని, ఆ రోడ్డు మీద స్థానిక ప్రజల రాకపోకలు ఉండేవని జనసేన, టీడీపీ నాయకులు అంటున్నారు. పెద్దిరెడ్డి ఆ ప్రాంతంలో బంగ్లా కట్టిన తరువాత ఎమ్మెఆర్ పల్లి, వెస్ట్ చర్చి ప్రాంతాలకు రాకపోకలు జరిగాయి
అయితే కార్పోరేషన్ అధికారులు సీసీ రోడ్లు వేసిన తరవాత సామాన్య ప్రజలు సంచరించకుండా రోడ్డుకు ఇరువైపుల ఇనుప గేట్లు పెట్టించారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ విషయంపై ఎన్డీఏ ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డీసీఎం పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేస్తామని, ప్రజల సొమ్ముతో సొంత ఇంటి వరకు సీసీ రోడ్డు వేయించుకున్న పెద్దిరెడ్డి భాగోతం బయట పెడుతామని తిరుపతి టీడీపీ, జనసేన నాయకులు అంటున్నారు.
తిరుపతి సిటీలోని ఎయిర్ బైపాస్ రోడ్డు సమీపంలోన రాయల్ నగర్ లో సుమారు మూడు ఎకరాల్లో పెద్దిరెడ్డ రామచంద్రా రెడ్డి ఇంటిని నిర్మించారని అంటున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతిలో అదే ఇంటిలో నివాసం ఉంటున్నారు.












Click it and Unblock the Notifications