వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో YCPతో కలిసి BJP ప్రయాణం?

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉన్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను దాదాపుగా భార‌తీయ జ‌న‌తాపార్టీతో దూరం జ‌రుగుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసిన‌ట్ల‌వుతోంది. జ‌న‌సేన త‌ర‌ఫున ఇద్ద‌రు ప్ర‌తినిధుల‌ను ఆ కార్య‌క్ర‌మానికి పంపించారు. కేవ‌లం సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌లికారు.

 వైసీపీతో క‌లిసి వెళ‌దాం.. బీజేపీ

వైసీపీతో క‌లిసి వెళ‌దాం.. బీజేపీ


రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్ల‌డంక‌న్నా వైసీపీతో క‌లిసి వెళ్ల‌డం మేల‌నే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ ఏపీ బీజేపీ నేత‌లు కేంద్ర పెద్ద‌ల‌కు ఒక నివేదిక అందించిన‌ట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తువ‌ల్ల మైనార్టీలు దూర‌మ‌య్యే ప్ర‌మాద‌ముండ‌టంతో ఈ అంశంపై జ‌గ‌న్ ఇంత‌వ‌ర‌కు ఏమీ మాట్లాడ‌లేదు. జ‌గ‌న్‌తో క‌లిసి వెళ్ల‌డంవ‌ల్ల కొన్ని సీట్లు గెలుచుకోవ‌డంతోపాటు వీలైతే ప్ర‌భుత్వంలో చేరే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని బీజేపీ నేత‌లు భావిస్తున్నారు. దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పంద‌నా రాలేదు.

అపాయింట్‌మెంట్ నిరాక‌రిస్తున్న కేంద్రం?

అపాయింట్‌మెంట్ నిరాక‌రిస్తున్న కేంద్రం?


జ‌న‌సేనాని కూడా కొద్దిరోజులుగా ఢిల్లీ స్థాయిలో పెద్ద‌ల‌ను క‌ల‌వ‌డానికి అపాయింట్‌మెంట్ అడుగుతున్నా
ఇవ్వ‌క‌పోతుండ‌టం ఆయ‌న్ను ఆలోచ‌న‌లో ప‌డేసింది. తెలుగుదేశం పార్టీతో వెళ్ల‌డం బీజేపీకి ఇష్టంలేద‌ని, ప‌వ‌న్‌కు అపాయింట్ మెంట్ ఇస్తే ఆ విష‌యాన్నే ప్ర‌స్తావిస్తార‌ని, అందుకే ఇవ్వ‌డంలేద‌ని స‌మాచారం. రాష్ట్రంలో వాస్త‌వ ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌డానికి కూడా స‌మ‌యం ఇవ్వ‌క‌పోతుండ‌టంతోపాటు రాష్ట్రంలోని బీజేపీ నేత‌లు కొంద‌రు రాష్ట్ర ప్ర‌భుత్వంతో లోపాయికారీగా స్నేహం చేస్తుండ‌ట‌తో జ‌న‌సేనాని త‌న‌దారి తాను చూసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్ల‌డిస్తున్నాయి.

సందిగ్ధంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

సందిగ్ధంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌


బీజేపీ-జ‌న‌సేన ఉమ్మ‌డి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌ను గ‌తంలో ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ముందుగా ముఖ్య‌మంత్రిని ప్ర‌తిపాదించే అల‌వాటు త‌మ పార్టీలో లేద‌ని కేంద్ర పెద్ద‌లు అందుకు అంగీక‌రించ‌లేదు.
రాష్ట్రంలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో క‌లిసి వెళ్ల‌డ‌మే స‌రైన నిర్ణ‌య‌మ‌నే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్నారు. అయితే అందుకు కేంద్ర పెద్ద‌లు సుముఖంగా ఉన్నారా? లేరా? అనే విష‌యంలో కూడా స్ప‌ష్ట‌త రాక‌పోతుండ‌టంతో ప‌వ‌న్ సందిగ్ధంలో ప‌డ్డారు.

మీడియా ప్ర‌శ్న‌ల‌కు ఔనంటున్న బీజేపీ నేత‌లు

మీడియా ప్ర‌శ్న‌ల‌కు ఔనంటున్న బీజేపీ నేత‌లు


మీడియా ప్ర‌శ్న‌ల‌కు మాత్రం త‌మ రెండు పార్టీల మ‌ధ్య పొత్తుంటుంద‌ని బీజేపీ నేత‌లు చెబుతున్నారు. కానీ వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ ఉద్దేశంలో లేర‌ని జ‌న‌సేన శ్రేణులే చెబుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి గురించి, ఆర్థిక ప‌రిస్థితి గురించి, మౌలిక సౌక‌ర్యాల గురించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల గురించి ఒక అవ‌గాహ‌న ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ వారిపై ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. త‌న‌తోపాటు మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ నేత‌లు కొంద‌రు లోపాయికారీగా వైసీపీకి స‌హ‌క‌రిస్తుండ‌టంతో మ‌న‌స్తాపానికి గురైన ప‌వ‌న్ ఆ విష‌యాన్ని ఎక్క‌డా బ‌య‌ట ప‌డ‌నీయ‌కుండా జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. తిరుప‌తి లోక్‌స‌భ‌కు జ‌రిగిన ఉప ఎన్నిక త‌ర్వాతే ఈ రెండు పార్టీల మ‌ధ్య దూరం పెరిగింది. అప్ప‌టి నుంచి ఆ దూరం పెరుగుతూనే చివ‌ర‌కు రెండు పార్టీల మ‌ధ్య పొత్తు వీగిపోయే స్థితికి వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

English summary
There is a possibility of BJP going with YCP in Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X