జగన్ తిరుమల పర్యటన రద్దు వెనుక అసలు కారణాలు ఇవే !!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు అయ్యింది. తిరుమలలో వైఎస్ జగన్ డిక్లరేషన్ పై సంతకం చెయ్యాలని అధికార పార్టీ నాయకులు పట్టుబడుతున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. జగన్ తిరుమల పర్యటన రద్దు కావడంతో హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు సంతోషంగా ఉన్నారు.

ఇదే సమయంలో వైసీపీ నాయకులు అయోమయంలో పడ్డారు. మాజీ సీఎం జగన్ తిరుమలలో డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయరని టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం తిరుపతిలో మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన కొంతసేపటికే మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్ద అయ్యింది. ఈ సందర్భంలో వైసీపీ నాయకులు ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

These are the real reasons behind the cancellation of former CM Jagan s visit to Tirumala

రేణిగుంట నుండి జగన్ ర్యాలీగా పిలుచుకుని వెళ్లాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న వైసీపీ నాయకుల ప్లాన్ ను పోలీసులు అడ్డుకున్నారు. అడుగడుగునా విమర్శలు, తీవ్రస్థాయిలో ఆరోపణల వస్తున్న సమయంలో జగన్ తిరుమల పర్యటన రద్దుకు చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. వైసీపీ నాయకులు రేణిగుంట నుండి అందుబాటులో ఉండరని ముందుగానే సమాచారం అందుకున్న మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని తెలిసింది.

ఆర్భాటాలు లేకుండా జగన్ ఎక్కడికీ వెళ్లడని, వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఏక్ నిరంజన్ అంటూ తిరుమల వెళ్ళలేక జగన్ ఆయన పర్యటన రద్దు చేసుకున్నారని కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అయితే డిక్లరేషన్ విషయంలో పలు ఆరోపణలు రావడం, ఈ విషయంలో టీటీడీ అధికారులు అధికారికంగా ఎలా స్పందిస్తారో తెలియక పోవడంవల్లనే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని తెలిసింది.

తిరుమలకు వెళ్లిన తర్వాత డిక్లరేషన్ పై సంతకం చేసినా, చెయ్యకపోయినా లేనిపోని ఇబ్బందులు ఎదురౌతాయని, అన్ని రకాలుగా ఆలోచించిన మాజీ సీఎం జగన్ ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని తెలిసింది. శుక్రవారం తిరుమలకు వెళ్లిన తర్వాత శనివారం శ్రీవారిని దర్శనం చేసుకునే ముందు డిక్లరేషన్ పై సంతకం చేస్తే గతంలో మీరు ఎందుకు డిక్లరేషన్ పై సంతకం చేయలేదని అధికార పార్టీ నాయకులు ప్రశ్నించే అవకాశం ఉందని జగన్ ఆలోచించాలని తెలిసింది.

మరోవైపు డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే తిరుమల సాంప్రదాయాన్ని, హిందూ దేవుళ్లను జగన్ గౌరవించడం లేదని అధికార పార్టీ నాయకులు ప్రచారం చేసినా అది తమకే నష్టమని ఆలోచించిన జగన్ తిరుమల పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేశారని తెలిసింది. మొత్తం మీద జగన్ తిరుమల పర్యటన రద్దు కావడంతో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, హిందూ సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ నాయకులు కార్యకర్తలు నిరాశ చెందారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+