నరేంద్రమోడీపై కాసుల వర్షం కురిపిస్తున్న రైళ్లు
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు నాణ్యమైన సేవలందించేందుకు భారతీయ రైల్వే నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. అందులో భాగంగా ఇటీవలే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. త్వరలోనే వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టబోతోంది. ప్రయాణికులకన్నా సరకు రవాణాద్వారానే రైల్వేకు అత్యధిక ఆదాయం వస్తుంటుంది. అయితే కొన్ని ప్రధాన రైళ్లు మాత్రం రైల్వేకు ఆదాయాన్ని సంవత్సరం పొడువునా ఆర్జించి పెడుతూనే ఉన్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే రోజూ 22,593 రైళ్లను నడుపుతోంది. ఇందులో 13,452 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. వీటిలో కొన్ని రైళ్లలో తక్కువ మంది ప్రయాణికులతో వెళ్తుంటే.. మరికొన్ని రైళ్లు ఏడాది పొడవునా రద్దీగా నడుస్తుంటాయి. ఏడాది పొడవునా రద్దీగా ఉంటూ అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిపెడుతున్నాయి.
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్..
బెంగుళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ( 22692) హజ్రత్ నిజాముద్దీన్ నుంచి బెంగళూరు వరకూ నడుస్తుంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో ఈ రైలు ద్వారా రూ.176 కోట్ల ఆదాయం వచ్చింది.

సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్..
న్యూఢిల్లీ మీదుగా కోల్‌కతా వెళ్లే సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు కూడా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించిపెడుతోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకి దీనిద్వారా రూ.128 కోట్ల ఆదాయం వచ్చింది.
న్యూఢిల్లీ- దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ నుంచి దిబ్రూఘర్ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఆదాయపరంగా మూడో స్థానంలో ఉంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.126కోట్ల ఆదాయం వచ్చింది.
ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్.
న్యూఢిల్లీ, ముంబయి మధ్య నడిచే ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.122 కోట్ల ఆదాయం వచ్చింది.
దిబ్రూగర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
దిబ్రూగర్ టౌన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ద్వారా కూడా ఇండియన్ రైల్వేకి ఆదాయం వస్తోంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో రూ.116 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.












Click it and Unblock the Notifications