ఈ రైల్వేస్టేషన్ లో అందరూ మహిళలే... ఏపీలోనే
శక్తికి ప్రతీక స్త్రీ. ఏ రంగంలోను వారు పురుషులకంటే వెనకబడిలేరు. ఎవరైనా వెనకబడ్డారు అన్నారంటే వారంతా పాతకాలంలో ఉన్నట్లు లెక్క. మహిళలు లేకుండా ఏ రంగం ప్రస్తుతం విజయం సాధించలేని స్థితి. పురుషులతోపాటు సమానంగా, మరికొన్ని రంగాల్లో వారికంటే ముందుగానే పయనిస్తున్నారు. అలాగే భారతీయ రైల్వే కూడా మహిళల అభ్యన్నతికి తోడ్పాటునందిస్తోంది. ఈ క్రమంలోనే 5 రైల్వేస్టేషన్ల బాధ్యతలను మహిళలకే అప్పగించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఐదు రైల్వేస్టేషన్లను స్త్రీలే నిర్వహిస్తున్నారు.
చంద్రగిరి రైల్వేస్టేషన్ : ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి రైల్వేస్టేషన్ గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉంది. ఇక్కడ పనిచేసేవారంతా మహిళలే. స్టేషన్ మాస్టర్ నుంచి పోలీసు సిబ్బంది వరకు అందరూ మహిళలే ఉన్నారు.

మాతుంగా రైల్వేస్టేషన్ : ముంబయిలోని మాతుంగా రైల్వేస్టేషన్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా అందరూ మహిళలే. 2018లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ స్టేషన్ చోటు దక్కించుకుంది.
గాంధీనగర్ రైల్వేస్టేషన్ : రాజస్తాన్ రాజధాని జైపూర్ లో ఈ స్టేషన్ ఉంది. ఇక్కడ కూడా అందరూ స్త్రీలే. మహిళలే నిర్వహించే తొలి రైల్వేస్టేషన్ గా గుర్తింపు పొందింది.
మణినగర్ రైల్వేస్టేషన్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దీన్ని నిర్మించారు. దేశంలో అందరూ మహిళలే నిర్వహిస్తున్న స్టేషన్ లో నాలుగో స్థానంలో ఉంది. స్టేషన్ మాస్టర్ తో కలిపి 26 మంది ఉద్యోగులున్నారు. వీరంతా మహిళలే. రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 10 మంది మహిళా సైనికులు ఇక్కడ భద్రతను నిర్వహిస్తున్నారు.
అజ్ని రైల్వేస్టేషన్ : మహారాష్ట్రలోని నాగపూర్ లో దీన్ని నిర్మించారు. అందరూ మహిళలే నిర్వహించే స్టేషన్లలో మూడోస్థానంలో నిలిచింది. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఈ స్టేషన్ నుంచి రోజుకు ఆరువేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications