Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెగా బ్రదర్స్ కు కుడిభుజం - ఇప్పుడు జనసేన లక్ష్యంగా : ఆ నేత పెత్తనం నచ్చకే..!?

నాడు ప్రజారాజ్యం. నిన్నటి వరకు జనసేన. నాడు చిరంజీవి..నిన్నటి వరకు పవన్ కల్యాణ్. ఇద్దరికీ సన్నిహితంగా వ్యవహరించిన నేత దూరమయ్యారు. జనసేనలో కీలకంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ ఈ రోజు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వకరిస్తున్నారు. అంతే కాదు.. జనసేన లోని మరి కొందరు నేతలను తనతో పాటు తీసుకెళ్తున్నారు. మెగా బ్రదర్స్ కు అంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి.. ఇప్పుడు జనసేనకు ఎందుకు నష్టం చేస్తున్నారు. పవన్ కు దూరం అవటానికి కారణం ఏంటి. వరుసగా కీలక పదవుల్లోని నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోంది...

చిరంజీవి - పవన్ తో సన్నిహిత సంబంధాలు..

చిరంజీవి - పవన్ తో సన్నిహిత సంబంధాలు..

మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ కు తొలి నుంచి మెగా బ్రదర్స్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రజారాజ్యం కార్యాలయం కూడా ఆయనే ఇచ్చింది. ప్రజారాజ్యం నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేసి 2009లో ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తరువాత కోర్ నేతలుగా వ్యవహరించిన వారంతా చిరంజీవికి దూరమయ్యారు. కాంగ్రెస్ లో చేరలేక..ఎవరి దారి వారు చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ వైసీపీ నుంచి ఏలూరు ఎంపీగా పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. ఇక, జనసేనాని పవన్ తో ఉన్న సంబంధాలతో ఆ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసారు. కానీ, గెలవలేదు. ఎన్నికల్లో గెలవకపోయినా.. పవన్ కల్యాణ్ ను సన్నిహితుడుగా జనసేన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించిన తోట చంద్రశేఖర్ తో సహా వరుసగా నేతలు పార్టీకి దూరం కావటం చర్చనీయాశంగా మారుతోంది.

పవన్ కు వరుసగా దూరం అవుతున్న నేతలు

పవన్ కు వరుసగా దూరం అవుతున్న నేతలు


2019 ఎన్నికల తరువాత జనసేనకు పలువురు నేతలు దూరం అవుతున్నారు. ఇప్పుడు తోట చంద్రశేఖర్ తనతో పాటుగా మరి కొంత మంది జనసేన నేతలతో కలిసి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. అందునా జనసేన బలం ఎక్కువగా భావించే గోదావరి జిల్లాల నేతలను తన వెంట తీసుకెళ్తున్నారు. వారి ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా..ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పార్టీని ఎవరూ వీడినా నష్టమేననే విశ్లేషణలు ఉన్నాయి. పార్టీలో చేరిన మాజీ ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా పని చేసిన తోట చంద్రశేఖర్ పార్టీలో జరుగుతున్న పరిణామాల కారణంగానే దూరంగా ఉంటున్నారని సమాచారం. తోట తన ఛానల్ ను కూడా పార్టీకి మద్దతుగా నడిపారు. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించటంతో ఆయనకు పార్టీలో పలు జిల్లాల్లో కీలక నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కు దగ్గరి వ్యక్తిగా పేరుండటంతో పలువురు నేతలు ఆయనతోనే టచ్ లో ఉండేవారు. ఇప్పుడు తోటతో గోదావరి , సీమ ప్రాంతాలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు.

మనోహర్ పెత్తనం నచ్చటం లేదంటూ..

మనోహర్ పెత్తనం నచ్చటం లేదంటూ..


పార్టీలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ తరువాత మొత్తం నాదెండ్ల మనోహర్ అన్నట్లుగా పరిస్థితి ఉందనే అభిప్రాయం కొద్ది రోజులుగా వినిపిస్తోంది. తోట చంద్రశేఖర్ లాంటి నేతలు పార్టీకి అండగా నిలుస్తున్నా.. ఎవరి మాటకు విలువ దక్కటం లేదనే చర్చ పార్టీలో ఉంది. వ్యక్తిగతంగా పవన్ - తోట చంద్రశేఖర్ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెబుతున్నారు. పార్టీ సొంతంగా ఎదిగే అవకాశాలు ఉన్నా.. టీడీపీతో పొత్తు దిశగా పవన్ ను మనోహర్ ప్రభావితం చేస్తున్నారనేది మరో వాదన. దీని కారణంగానే తోట కొంత కాలంగా జనసేనలో స్తబ్దుగా ఉన్నారని చెబుతున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఉన్న సంబంధాలతో ఇప్పుడు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి..బీఆర్ఎస్ ఏపీలో ఈ నేతల ద్వారా ఎటువంటి కొత్త సమీకరణాలకు కారణమవుతుందనేది చూడాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+