తోట త్రిమూర్తులు నాకు ఎప్పుడు శత్రువే : పిల్లి సుభాష్ చంద్రబోస్
ఇటివల టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీలోకి చేరిన మాజీ ఎమ్మెల్యే తనకు ఎప్పుడు శత్రువే అని ప్రకటించారు. అయన ఎప్పుడు మిత్రుడుగా లేడని పార్టీలో వైసీపిలో చేరినంత మాత్రాన త్రిమూర్తులు మిత్రుడు కాలేడని వ్యాఖ్యానించారు.
గత కొద్ది సంవత్సరాలుగు తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు ప్రత్యర్ధులుగా కొనసాగుతున్నారు. కాగ ఇటివల జరిగిన ఎన్నికల్లో తోట త్రిమూర్తులు రామచంద్రపురం అసెంబ్లీ నియోజవర్గం నుండి పోటీ చేయగా వైకాపా అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. దీంతో ఆయన కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన దళితులను అవమానించిన శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న త్రిమూర్తులను పార్టీలో చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...దళిత ఐక్యపోరాట వేదిక ఆధ్వర్యంలో పిల్లి సుభాష్ కాన్వాయ్ కూడ అడ్డుకున్నారు. దళితులకు వ్యతిరేకులుగా ఉన్న ఆయన్ను ఎలా పార్టీలో చేర్చుకుంటారని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి ఎంతోమంది వస్తూ.. పోతూ ఉంటారు. అయినంత మాత్రన గతంలో ఉన్న శతృత్వం మాసిపోదని అన్నారు. ఆయన అప్పుడు ఇప్పుడు కూడ శత్రువే అని అన్నారు. మరోవైపు కేసు విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications