ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చింతమనేని సంచలనం - హత్యకు షూటర్ ను నియమించారు : ఫోన్ కాల్ - ఫిర్యాదు..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణ హాని ఉందంటూ మరోసారి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. చింతమనేని తనకు ఒక బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేయడం కోసం షూటర్‌ను నియమించినట్లు అగంతకుడు ఫోన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్థోమత లేదని.. పోలీసులే భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు. ఇటీవల తనను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించిందని చింతమనేని ఆరోపించారు.

టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడినంటూ చింతమనేని సంచలనానికి తెర తీసారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు తన పైన కేులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ ఆయన ఏలూరు కోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో ఫిర్యాదు చేసారు. సీఎం జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నవ్‌జ్యోత్‌సింగ్‌ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు, సహకరించిన 21 మందిని శిక్షించాలంటూ ఆ పిటీషన్ లో కోరారు. ఇక, ఇప్పుడు తనకు వచ్చిన కాల్ లో 'నీత్యకు షూటర్‌ని మా బాస్‌ నియమించాడు' అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసినట్లు చింతమనేని చెబుతున్నారు.

Threaten call to TDP leader Chitnamaneni, police complaint registered

ఆగంతకుడి ఫోన్‌కాల్‌పై త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో చింతమనేని ఫిర్యాదు చేశారు.దీని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలో చింతమనేని పైన కేసులు నమోదయ్యాయి. టీడీపీలో ఎమ్మెల్యేగా ..విప్ గా పని చేసిన చింతమనేని నాటి ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో వనజాక్షి విషయంలో వివాదాస్పదం అయ్యారు. మహిళా అధికారితో అనుచితంగా వ్యవహరించిన చింతమనేని పైన చర్యలు తీసుకోవాలంటూ నాడు ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేసింది. ఇక, ఇప్పుడు చింతమనేని తన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందంటూ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగానూ చర్చకు కారణమయ్యాయి.

English summary
TDP leader Chintamaneni Prabhar complaint to police on threaten call, Already filed petition in Eluru court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X