టీడీపీలో కలకలం: మహిళా మేయర్‌కు బెదిరింపు సందేశం
అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ స్వరూప సహా అధికార పార్టీ నేతలకు ఓ ఆగంతకుని నుంచి వస్తున్న బెదిరింపులు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి.
అనంతపురం: నగర పాలక సంస్థ మేయర్ స్వరూప సహా అధికార పార్టీ నేతలకు ఓ ఆగంతకుని నుంచి వస్తున్న బెదిరింపులు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి బెదిరింపులు మెసేజ్‌లు వస్తుండటంతో టీడీపీ నేతళ్ళో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
ఇటీవల మేయర్ స్వరూప, ఆమె భర్త వెంకటేష్‌కు ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి మేసెజ్ వచ్చింది. తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలి పదవికి స్వరూప రాజీనామా చేయాలని, లేని పక్షంలో అంతుచూస్తామని ఆ సందేశంలో ఆగంతకుడు బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో మేయర్ జనవరి 30న ఎస్పీ రాజశేఖరబాబుకు కార్యాలయంలో మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అధికార పార్టీలో లుకలుకలు ఏర్పడినప్పుడల్లా ఇలాంటి సందేశాలు వస్తున్నాయంటూ ఆమె తెలిపినట్లు తెలిసింది.
కాగా, మేయర్‌కు మెసేజ్ పంపిన ఫోన్ నెంబర్ కడప జిల్లా మైదుకూరులో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మేయర్‌ను సంప్రదించగా మెసేజ్ వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు.
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications