విషాదం: ఎవరూ లేరని మంత్రాలయంలో ముగ్గురి ఆత్మహత్య
కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో పాండిచ్చేరికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
మంత్రాలయం: కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో పాండిచ్చేరికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పాండిచ్చేరికి చెందిన శరవణన్ ఆయన సోదరి శాంతి, ఆమె కుమార్తై పవిత్ర రెండు రోజుల క్రితం మంత్రాలయానికి వచ్చారు. మంత్రాలయంలోని గెస్టుహౌజ్ లో వారు బస చేశారు. శుక్రవారం నాడు వారు మంత్రాలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకొన్నారు.

అయితే రెండు రోజులుగా వారు గది నుండి బయటకు రాలేదు. అంతేకాదు గది నుండి దుర్వాసన వస్తోంది. ఈ దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు గెస్ట్ హౌజ్ తలుపులు పగులగొట్టి చూశారు. అయితే గదిలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉన్నారు. తమకు ఎవరూ లేరని, దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా వారు లేఖ రాశారు.
తమ మృతదేహలను మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. మృతదేహలకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications