నువ్వుల లడ్డు ఇలా చేసి తింటే సూపర్ టేస్ట్.. హెల్త్ కి బెస్ట్!
మనం తినే ఆహారం పోషకాలతో ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో పిల్లలకు స్నాక్స్ విషయంలో కూడా ఆరోగ్యకరంగా ఉన్న వాటిని ఎంచుకోవటం చాలా అవసరం. అలాంటి వాటిలో నువ్వులతో చేసిన లడ్డులు చాలా మంచివి. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ముఖ్యంగా యుక్త వయస్సు వచ్చిన బాలికలకు మరింత మంచివి. అటువంటి నువ్వుల లడ్డులు ఎలా తయారు చేసుకోవాలి. ఎలా చేస్తే రుచిగా ఉంటాయి. పక్కా కొలతలతో తెలుసుకుందాం.
తయారీకి కావాల్సిన పదార్ధాలు
నువ్వులు - 100 గ్రాములు
కొబ్బరి (సగం, ఆరినది) - 50 గ్రాములు
బెల్లం (అరిసెల బెల్లం మంచిది) - 150 గ్రాములు
ఏలకులు - 2

తయారీ విధానం
లడ్డు తయారీకి నువ్వులకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో పెట్టి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఆ తర్వాత వాటిని చల్లార్చుకోవాలి. లడ్డూల తయారీకి కొబ్బరిని ఆరబెట్టుకుని బాగా తడిలేకుండా చేసుకుని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో పొడి చెయ్యాలి. వేయించి చల్లార్చుకున్న నువ్వులను కూడా 1/3 భాగం మిక్సీలో పొడి చేసుకోవాలి.
ఇలా తయారు చేస్తే సూపర్ రుచి
ఒక గిన్నెలో తురుముకున్న బెల్లం, యాలుకల పొడి, పొడి చేసుకున్న కొబ్బరి వేసి బాగా కలపాలి. స్టవ్ మీద మీడియం మంటలో ఉంచి బెల్లం కరిగేవరకు వేడి చెయ్యాలి. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి, పొడి చేసుకున్న నువ్వులు, వేయించి పెట్టుకున్న మిగిలిన నువ్వులు వేసి బాగా కలపాలి. మిశ్రమం కాస్త ఆరాక, వేడిగానే చేతులకు కాస్త నెయ్యి రాసుకుని గుండ్రంగా లడ్డూలు చేసుకోవాలి.
ఆరోగ్యకరమైన లడ్డూలు
ఈ లడ్డూలు కాస్త వేడి మీద ఉన్నప్పుడు చేస్తేనే వస్తాయి. బాగా చల్లారితే రావు కనుక చల్లారకుండానే లడ్డూలు చేసుకోవాలి. ఈ రుచికరమైన లడ్డులు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ లడ్డూలు మీ పిల్లలకు స్నాక్స్ గా ఇస్తే వారి శరీర ఎదుగుదలకు కావాల్సిన పౌష్టికాహారం అందుతుంది. పిల్లలకే కాదు పెద్దలకు ఇది ఎంతో మంచిది. చాలా సింపుల్ గా తయారు చేసుకోగల ఈ రెసిపీని తయారు చేసుకోండి.












Click it and Unblock the Notifications