మూగ యువతిపై రేప్: ప్రమాదంలో దంపతుల మృతి

ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి స్థానిక ఎస్‌ఐ ఉమేష్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఐ నిందితుడిని అదుపులోకి తీసుకొని బాధితురాలిని వైద్యపరీక్షల కోసం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సిఐ సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. యువతి అక్కాబావల వద్ద ఉంటోందని పోలీసులు తెలిపారు.
భార్య, కొడుకును మోటారు బైకుపై ఎక్కించుకుని వెళుతుండగా లారీ ఢీకొనడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కుమారుడికి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - ఎం శ్రీరామ్ (50) అతని భార్య శ్రీఉమాదేవి (45) వీరి కొడుకు శైలేష్‌కుమార్ ముగ్గురూ కలిసి ఆదివారం మధ్యాహ్నం మోటారు బైకుపై తెనాలి నుంచి నారాకోడూరు మీదుగా గుంటూరు వైపు వెళ్తున్నారు. నారాకోడూరు దాటాక బుడంపాడు వద్ద గుంటూరు వైపు నుంచి ఎదురుగా పత్తిలోడ్‌తో వస్తున్న భారీ లారీ మోటారు బైకును ఢీకొంది.
ఈ ప్రమాదంలో శ్రీరామ్, శ్రీఉమాదేవి అక్కడికక్కడే మృతిచెందగా వారి కుమారుడు శైలేష్‌కుమార్‌కు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్, క్లీనర్‌లు పరారీలో ఉన్నారు. చనిపోయిన శ్రీరామ్ తెనాలి బిఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసుల ద్వారా తెలిసింది.












Click it and Unblock the Notifications