జనంపైకి దూసుకెళ్లిన బస్సు: ముగ్గురు మృతి (వీడియో)
బుడమేరు వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు గన్నవరం వాంబే కాలనీ నుంచి బస్టాండ్ వెళ్తోంది.
విజయవాడ: బుడమేరు వంతెన వద్ద ఓ ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం బీభత్సం సృష్టించింది. గవర్నర్‌పేట డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సు గన్నవరం వాంబే కాలనీ నుంచి బస్టాండ్ వెళ్తోంది.
బుడమేరు వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిలై బస్సు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఓ ఆటో, నాలుగు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
మృతులను ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications