అనంతలో ఘోర ప్రమాదం: టైరు పేలి 'హైదరాబాద్' టెక్కీ ఫ్యామిలీ మృతి
హైదరాబాద్/అనంతపురం: ఏపీలోని అనంతపురం జిల్లాలో శుక్రవారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని కనగానపల్లి మండలంలోని 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారని తెలుస్తోంది. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
మృతులను హైదరాబాద్‌కు చెందిన చైతన్య చంద్ర, దీప్తి, సీతగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న కారు కనగానపల్లి వద్దకు చేరుకోగానే టైరు పేలింది. దీంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది.

ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బంధువుల ఇంటికి వెళ్తున్నారు.
ఈ ఘటనలో గాయపడ్డ చిన్నారుల్లో ఆరేళ్ల బాలుడు పీయూష్ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. రెండేళ్ల బాలుడు మాత్రం స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. కాగా, చైతన్య చంద్ర హైదరాబాదులో సాఫ్టువేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారని తెలుస్తోంది. మృతుల్లో చైతన్య చంద్ర, దీప్తి, సీతలతో పాటు డ్రైవర్ ఉన్నారు.












Click it and Unblock the Notifications