శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం.. ముగ్గురు మృతి !!

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బస్సులు, భారీ వాహనాలతో జరుగుతున్న ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఈ ఘటనలు ప్రభుత్వ యంత్రాంగం, రహదారి భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది.

సోంపేట మండలం బారువ జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. లారీ, కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉండటంతో ఘటనాస్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం... ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ అదుపుతప్పింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఢీకొన్న దెబ్బకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

three-killed-in-a-horrific-road-accident-in-srikakulam-district

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికుల సహాయంతో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ వారు కూడా మృతిచెందారు. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

మృతులు ఒడిశా వాసులుగా గుర్తింపు..

ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు ఏ పనిమీద ప్రయాణిస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్న వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను పక్కదారి ద్వారా మళ్లించి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, రహదారి భద్రత లోపాలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. భారీ వాహనాల నియంత్రణ, జాతీయ రహదారులపై భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+