వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు హత్యలు: ఐఎంఈఐ నెంబర్‌తో దొరికారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Three murder cases mystery solves cell phone clue
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగా రెడ్డి గూడెంలో సంచలం సృష్టించిన మూడు హత్య కేసుల్లో మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ మూడు హత్యలను ఒకే ఒక క్లూతో చేధించారు. జంగారెడ్డి గూడెంలో విష్టు ప్లాజా అపార్ట్ మెంట్‌లో వృద్దుడు కర్పూరం కృష్ణమూర్తిని హత్య చేసి దొంగిలించిన ఫోన్ ఐఎంఈఐ నెంబర్‌పై పోలీసులు ఆరా తీయడంతో నిందుతులను దొరికారు.

ఫోన్‌లో కృష్ణమూర్తి సిమ్ తీసివేసి వేరు వేరు సిమ్‌లతో వాడుతున్నారని తెలుసుకోని పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోని విచారించగా, కామవరపు కోటలో వాసా అంజనేయులు, జంగారెడ్డి గూడెం వడ్డీ వ్యాపారి నున్న వెంకట సుబ్బారావు హత్య కేసుల్లో వీరే నిందులని వెల్లడైందని పోలీసులు తెలిపారు.

ఈ హత్య కేసు వివరాలను జంగారెడ్డి గూడెంలోని తన కార్యాలయంలో ఆదివారం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు విలేకరులకు వెల్లడించారు. ఈ హత్యలకు ఎల్ ఐసీ ఏజెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారి దారా నారాయణ రావు ప్రధాన కారకుడని తెలిపారు. నిందితుడు నారాయణరావుని అరెస్టు చేసి, విచారించగా, మూడు హత్యలను చేశానని అంగీకరించాడని అన్నారు. హత్యలు చేయడంలో అతనికి సహకరించిన కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంకు చెందిన గాదె సురేష్, జంగారెడ్డి గూడెంకు చెందిన కొండా బత్తుల బ్రహ్మాజీలను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అధిక వడ్డీలకు డబ్బులు తీసుకోని వాటిని చెల్లించలేక, ఈ హత్యలు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 50 కాసుల బంగారం, 664 గ్రాముల వెండి, మృతుడు కృష్ణమూర్తికి చెందిన రెండు సెల్ ఫోన్‌లు, రూ. 1,35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన సాంత్రో జింగ్ కారు, రెండు బైక్‌లు, టీవీఎస్ జూపిటర్ మోపెడ్, నాలుగు సెల్ పోన్లును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

English summary
Three murder cases mystery solves cell phone clue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X