కృష్ణా జిల్లాలో క్షుద్రపూజల సంచలనం: ముగ్గురికి దేహశుద్ధి
విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో చేతబడి చేస్తున్నారనే ఆరోపణపై ప్రజలు ముగ్గురికి వ్యక్తులకు దేహశుద్ధి చేశారు. నాగేశ్, వెంకట్రావమ్మ, రవిలు చేతబడి పేరిట క్షుద్రపూజలు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామ పొలిమేరల్లో గ్రామస్థులు వారిని పట్టుకొని దేహశుద్ధి చేశారు.
ఈ సంఘటనతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో 40 మంది చేతబడి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆరోపణలు ఎదుర్కుంటునన్నవారిని తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్న చేశారు. పోలీసులు పలు విడతలుగా గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారు జాము వరకు ఆందోళనను కొనసాగించారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటైంది.












Click it and Unblock the Notifications