ఐపీఎల్ కోసం వచ్చి.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు: అక్కడికక్కడే ముగ్గురు మృతి
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన ఆగివు లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రహదారి పక్కన ఆగివు లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కారులో వెళ్తున్న నలుగురు వ్యక్తులు చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి వద్దకు రాగానే హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న చివ్వెంల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను, క్షతగాత్రుడిని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు గుంటూరుకు చెందిన వెంకటసాయి, తెనాలికి చెందిన పూర్ణచందర్‌రావు, అద్దంకికి చెందిన శ్రీకాంత్‌గా పోలీసులు గుర్తించారు.
ఆదివారం రాత్రి ఉప్పల్ మైదానంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ తిలకించిన వీరు.. తిరుగుపయనంలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications