తూ.గోలో బాలికపై కన్నతండ్రి అత్యాచారం... కృష్ణా జిల్లాలో బాలికపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్...

ఆంధ్రప్రదేశ్‌లో అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి.ఒకేరోజు మూడు వేర్వేరు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తూర్పు గోదావరిలో ఓ బాలికపై కన్నతండ్రే అత్యాచారానికి పాల్పడగా... కృష్ణా జిల్లాలో ఓ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. గుంటూరు జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మూడు ఘటనలు వెలుగుచూశాయి.

కూతురిపై కన్నతండ్రి అత్యాచారం...

కూతురిపై కన్నతండ్రి అత్యాచారం...

ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలో ఆగస్టు 15న ఓ బాలికపై అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇటీవల బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆరా తీశారు. దీంతో బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం(సెప్టెంబర్ 3) దిశా పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా... మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఆగస్టు 21న తన కన్న కూతురిపై కూడా అతను అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

కృష్ణా జిల్లాలో బాలికపై గ్యాంగ్ రేప్ :

కృష్ణా జిల్లాలో బాలికపై గ్యాంగ్ రేప్ :

పెడన నియోజకవర్గంలోని కృతివెన్ను మండలం సీతారంపురం గ్రామంలో ఓ బాలికపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. గురువారం(సెప్టెంబర్ 2) రాత్రి 7గంటల సమయంలో ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన బాలిక మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు రాత్రంతా ఆమె కోసం వెతికారు. అయినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. మరుసటిరోజు సాయంత్రం 4గంటలకు ఆమె ఇల్లు చేరింది. ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు ఆరా తీయగా... విజయవాడ వెళ్లానని చెప్పింది. అనుమానంతో గట్టిగా నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు తనను గ్రామంలోని ఓ గొడ్ల సావిడిలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. బాధిత బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం :

మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం :

గుంటూరు జిల్లాలోని ప్రత్తిపాడు మండలం యనమదలలో ఓ మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటో ఎక్కిన మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో డ్రైవర్‌కు,బాధితురాలికి కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+