Times Now-ETG: ఏపీలో ఆ పార్టీకి ఆఖరి రాగం పాడేశారు

Times Now - ETG Exit Poll Predictions AP Assembly: దేశవ్యాప్తంగా చివరి విడత లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై జాతీయ స్థాయి సంస్థలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వేర్వేరు అంచనాలను వెల్లడించాయి.

అసెంబ్లీలో ఒక రకంగా, లోక్‌సభలో మరో తీరుగా అవి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరా మస్తాన్, పార్ధా చాణక్య, పోల్ స్ట్రాటజీ, జన్మత్, పోలిటికల్ క్రిటిక్ వంటి సర్వే ఏజెన్సీలో వైఎస్ఆర్సీపీకి అబ్సల్యూట్ మెజారిటీని ప్రకటించాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు మాత్రం దీనికి పూర్తి భిన్నమైన ఫలితాలను విడుదల చేశాయి.

Times Now - ETG Exit Poll Predictions AP Assembly YSRCP will get majority seats 117 to 125

ఏపీ అసెంబ్లీపై తాజాగా మరో జాతీయ మీడియా హౌస్ టైమ్స్ నౌ- ఈటీజీ తన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇండియా టుడేకు పూర్తి భిన్నమైన అంచనాలు ఇవి. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది టైమ్స్ నౌ. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని తెలిపింది.

మొత్తం 175 స్థానాలు ఉన్న ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 88 సీట్ల సంఖ్యాబలాన్ని వైసీపీ అలవోకగా అందుకుంటుంది. 117 నుంచి 125 సీట్లతో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా 51 శాతం మేర ఓట్లను వైసీపీ సొంతం చేసుకుంటుంది.

టీడీపీ కూటమికి లభించే సీట్లు 50 నుంచి 58 వరకు ఉండొచ్చని టైమ్స్ నౌ ఈటీజీ అంచనా వేసింది. 47 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని తెలిపింది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే ఈ దఫా ఏకంగా 15 శాతం మేర మహిళల ఓటింగ్ అధికంగా నమోదైందని, మెజారీటీ ఓట్లు వైసీపీకే పోల్ అయినట్లు పేర్కొంది.

జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. తాజాగా ఏపీపై తన ఎగ్జిట్ పోల్ అంచనాలను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది టైమ్స్ నౌ- ఈటీజీ. ఎవరు అధికారంలోకి వస్తారనేది తేల్చి చెప్పింది.

లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అధిక స్థానాలు వస్తాయని టౌమ్స్ నౌ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం 25 సీట్లల్లో 13 నుంచి 15 లోక్‌సభ స్థానాల్లో వైసీపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేసింది. టీడీపీ కూటమికి 10 నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+