TIMES NOW-ETG Research Survey: ఏపీలో ఆ పార్టీదే హవా, కూటమికి షాకేనా?; తెలంగాణలో ఇలా

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలు చేస్తున్నాయి. తాజాగా, టైమ్స్‌నౌ-ఈటీజీ రీసెర్చ్ సర్వే (TIMES NOW-ETG Research Survey) తన ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందని తేల్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్‌సభ ఎన్నికల్లో 21-22 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇక, టీడీపీ-జనసేన పార్టీలకు కలిపి 3-4 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో మరోసారి ఏపీలో వైసీపీ హవా కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

TIMES NOW-ETG Research Survey 21-22 mp seats to YSRCP in andhra pradesh 3-4 for TDP JSP

మరోవైపు, తెలంగాణలోని 17 స్థానాలకు జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని టైమ్స్‌నౌ సర్వే తేల్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 8-10 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక, బీజేపీకి 4-6 ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 1-3 ఎంపీ స్థానాలు దక్కే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగితా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో డీఎంకేకు 21-22 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఖాతా ఓపెన్ చేయని బీజేపీ ఈసారి మాత్రం 2-6 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఏఐఏడీఎంకేకు 1-3, ఇతరులకు 4-5 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

కేరళ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే..

బీజేపీ: 0-1
కాంగ్రెస్ పార్టీ: 8-10
సీపీఎం: 6-8
ఐయూఎంఎల్: 1-2
ఇతరులు: 1-2

కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లంటే..

బీజేపీ: 21-23
కాంగ్రెస్: 4-6
జేడీఎస్: 1-2

కాగా, దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+