Times Now Navbharat Survey: జగన్ ను టచ్ చేయడం కష్టమే..పవన్ ఎఫెక్ట్ జీరో,బాబుకు షాక్..!

ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ ధీమాగా ఉన్నారు. అధికారం తమదే అంటూ చంద్రబాబు కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. వైసీపీ ఓటిమిని ఓడించి తీరుతానంటూ పవన్ కళ్యాణ్ ప్రతీ సభలో శపథం చేస్తున్నారు. మరి..ప్రజల మనసులో ఏముంది.

జగన్ కు మరోసారి అధికారం కట్టబెడతారా. చంద్రబాబుకే అవకాశం ఇస్తారా. పవన్ కు ఒక్క ఛాన్స్ అందిస్తారా. జాతీయ స్థాయిలో ఏపీ ప్రజలు ఎవరితో ఉన్నారు. ఇవే అంశాలపై జాతీయ ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది.

 YSRCP Poised to Bag 24-25 Lok Sabha Seats

జాతీయ సంస్థ సర్వే: ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నవ్..నవ్ భారత్ జన్ గన్ కా మన్ పేరుతో పబ్లిక్ మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేసింది. జూన్ చివరి వారంలో దేశ వ్యాప్తంగా ఓటర్ల నాడి తెలుసుకొనే ప్రయత్నం చేసింది. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాలతో పాటుగా రెండు తెలుగు రాష్టాల్లో ప్రజలు ఎవరికి మద్దతుగా నిలుస్తున్నారో సర్వే నిర్వహించింది.

అందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి..ఏ రాష్ట్రంలో ప్రజలు ఎవరి వైపు ఉన్నారనే అంశాలను వెల్లడించింది. అందులో బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారం దిశగా హ్యాట్రిక్ విజయం ఖాయమని తేల్చింది. తెలుగు రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్..వైసీపీతోనే ఉన్నారని సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

కేంద్రంలో బీజేపీ..ఏపీలో వైసీపీ: కేంద్రంలో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని సర్వే తేల్చింది. బీజేపీకి 285-325 మధ్య సీట్లు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ కు 111-149 మధ్య సీట్లు ఖాయమని వెల్లడించింది. టీఎంసీకి 20-22 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఒడిశాలో బిజూ జనతా దళ్ కు 12-14 సీట్లు వస్తాయని పేర్కొంది. ఆప్ కు 4-7, ఇతరులకు 18-38 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడించారు.

ఇక, తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు 9-11 సీట్లు వస్తాయని అంచాగా తేల్చింది. మొత్తం 17 స్థానాలు ఉండగా బీఆర్ఎస్ 50 శాతానికి పైగా సీట్లు గెలుస్తుందని వెల్లడించింది. ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని టైమ్స్ నవ్..నవ్ భారత్ సర్వే స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి 2019 నాటి ఫలితాలు రిపీట్ అవుతాయని లెక్క వేసింది.

YSRCP Poised to Bag 24-25 Lok Sabha Seats

24 లోక్ సభ స్థానాలు వైసీపీకే: ఈ సర్వే లెక్క ప్రకారం ఏపీలో వైసీపీకి 24-25 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టీడీపీకి 0-1 సీటుగా పేర్కొంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 22 లోక్ సభ స్థానాలు దక్కాయి. ఈ సర్వే అంచనాల ప్రకారం అంతకంటే ఒక సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయంగా భావిస్తున్న సమయంలోనే ఈ సర్వే జరిగింది. జూన్ చివరి వారంలో చేసిన సర్వేగా నిర్వాహకులు పేర్కొన్నారు.

అధికారికంగా పొత్తు ప్రకటన చేసినా..పెద్దగా మార్పు ఉండదని విశ్లేషిస్తున్నారు. ప్రజల్లో టీడీపీ, జనసేన కలిసే ఉన్నాయనే అభిప్రాయం కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. బీజేపీ వీళ్లతో కలిసినా..కలవకపోయినా ప్రభావం ఏపీలో చాలా స్వల్పమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 24 లోక్ సభ సీట్లు వైసీపీకి దక్కే పరిస్థితి ఉంటే..ఆ లెక్కన అసెంబ్లీలోనూ 2019 ఫలితాలు రిపీట్ అవుతుందనే అంచనాలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+