కూకట్పల్లిలో టిప్పర్ బీభత్సం: వాకర్స్ పైకి దూసుకెళ్లడంతో మహిళ మృతి..
గాయపడ్డ వ్యక్తులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కూకట్పల్లి: హైదరాబాద్ లోని కూకట్పల్లి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తుల పైకి దూసుకెళ్లింది. దీంతో జ్యోతి(45) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా, ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.
గాయపడ్డ వ్యక్తులను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ బ్రేక్ ఫెయిల్ అయిందని డ్రైవర్ చెప్పినట్లు సమాచారం. బ్రేక్ ఫెయిలవడంతోనే వేగాన్ని నియంత్రించలేక ప్రమాదం చోటు చేసుకుందని అతను పేర్కొనట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications