వేయి కనులైనా చాలవుగా... వేంకటేశా.. నిను దర్శింపగా..

గురువారం మధ్యాహ్నం నుంచి స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. స్వామివారి ఒంటిపై ఉన్న ఆభరణాలన్నీ తొలగించి, అరుదైన సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణ స్ధితికి చేరుకుంది. బుధవారం ఒక్కరోజే 62,101 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,896 మంది భక్తులు స్వామి వారికి తల నీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.37 కోట్లు రూపాయలు భించింది. స్వామివారి సర్వదర్శనానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది.

ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి స్వామివారికి పూలంగి సేవ నిర్వహిస్తారు. స్వామివారి ఒంటిపై ఉన్న ఆభరణాలన్నీ తొలగించి, అరుదైన సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరిస్తారు. దీనినే పూలంగి సేవ అని పిలుస్తారు. పూలతో అలంకరించిన స్వామివారి దర్శనం ఆ క్షణంలో మనల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది.

tirumal srivari offerings 3.37 Crores of rupees

వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి తొలి దర్శనం చేసుకుంటారు. అంతకుముందు రోజు రాత్రి పవళింపు సేవలో భాగంగా బంగారు నవ్వారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి మూలవిరాట్ పాదాలవద్ద ఉంచిన సింహాసనంపై జీవస్థానంలో వేయించేపు చేయిస్తారు. తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం ఉంటుంది. దీనినే కైకర్యపరుల హారతి అని కూడా పిలుస్తారు.

మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. శ్రీవారి మూలవిరాట్టుకు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్ప మాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి, రాత్రి అర్చన నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను పూజారులు నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+