మేం తప్పు చేస్తే రక్తం కక్కుకుని ఛస్తాం- భూమన

YS Jagan letter to PM Modi: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న దుమారం తగ్గట్లేదు. చంద్రబాబు వ్యాఖ్యల అనంతరం చోటు చేసుకుంటోన్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోన్నాయి.

వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంపై భారతీయ జనతా పార్టీ, యువమోర్చా నాయకులు, కార్యకర్తలు భారీగా దాడులకు పాల్పడటం దీనికి నిదర్శనం. గుంపులుగా వెళ్లిన బీజేవైఎం నాయకులు జగన్ ఇంటిపై కాషాయరంగుతో కూడిన పాకెట్లను విసిరేశారు.

Tirumala Laddu row Bhumana Karunakar Reddy slams CM Chandrababu

ఈ పరిణామాలపై తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తిరుమల లడ్డూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకుంటోన్నాడని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడిని కూడా వదల్లేని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో శ్రీవారిని, తిరుమల ఆలయాన్ని అడ్దుపెట్టుకుని ఎన్నో ఆరోపణలు గుప్పించారని, తీరా తాము అధికారంలోకి వచ్చాక వాటిని నిరూపించలేక చేతులెత్తేశారని విమర్శించారు. ఇప్పుడు కొత్తగా జంతువులు, చేపల కొవ్వుతో తిరుమల లడ్డూలను తయారు చేశారనే కొత్త పాట పాడుతున్నాడని మండిపడ్డారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి మీద అభాండాలు వేసి చంద్రబాబు ఘోరమైన అపచారం చేశాడని, దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని భూమన అన్నారు. చంద్రబాబు ఉద్దేశపూరకంగా చేసిన అపచారాలను స్వామివారు ఎప్పటికీ క్షమించబోరని చెప్పారు. తాము తప్పు చేస్తే రక్తం కక్కుకుని చావాలని శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకుంటోన్నానని, టీడీపీ తప్పు నిరూపించడానికి సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

టీటీడీ రిపోర్టులను బయటపెట్టింది తిరుమల అధికారులు కాదని, టీడీపీ కార్యాలయం నుంచి అది ఎలా బయటికి వచ్చిందని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి నియమించిన కమిటీలో టీడీపీ ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, మంత్రి పార్థసారథి ఉన్నారని వాళ్లు ఈ విషయంపై ఎందుకు మాట్లాడట్లేదని అన్నారుు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+