తిరుమలలో స్వర్ణరథోత్సవం నాడు
తిరుమలలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. స్వామివారి రోజుకో వాహనసేవపై అశేష భక్తజనాన్ని కరుణిస్తోన్నారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో వేలాదిమంది భక్తులు కనులారా ఉత్సవాలను దర్శించుకుంటోన్నారు. ప్రత్యేక పూజలు చేస్తోన్నారు. స్వామివారి వాహన సేవకు ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోన్నాయి.
ఆరో రోజైన సోమవారం సాయంత్రం 7 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనం ఇచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహనసేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహనసేవలో దర్శించుకున్నారు.

ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు అత్యంత ఘట్టం.. రథోత్సవం. అక్టోబర్ 1వ తేదీన ఈ ఉత్సవాన్ని నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు బంగారు తేరులో విహరించారు. అశేష భక్తజనులను కటాక్షించనున్నారు. భక్తుల నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య తిరు మాడవీధులలో కన్నులపండువగా స్వర్ణరథోత్సవాన్ని నిర్వహించడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం. భక్తుల సౌకర్యం కోసం తిరుమల నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తుల సౌకర్యార్థం ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేశామని టీటీడీ వెల్లడించింది. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు సమన్వయం చేసుకుని గ్యాలరీలు, ఔట్ సైడ్ క్యూలైన్లు, వీక్యూసీ -2 క్యూలైన్లు, బయటి ప్రాంతాల్లో ప్రతి భక్తుడికి అన్నప్రసాదాలు అందే ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications