తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శీఘ్రమే.. తిరుమలలో దర్శనంలో సరికొత్త మార్పులు! ఆధార్ కార్డు తేకుంటే

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం విధానంలో సరికొత్త మార్పులు తీసుకు వచ్చేందుకు టీటీడీ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాన్య భక్తులకు కూడా నిర్దిష్ట వ్యవధిలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు త

|
Google Oneindia TeluguNews

తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం విధానంలో సరికొత్త మార్పులు తీసుకు వచ్చేందుకు టీటీడీ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాన్య భక్తులకు కూడా నిర్దిష్ట వ్యవధిలో శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.

 టిటిడి ప్రయోగాత్మకంగా

టిటిడి ప్రయోగాత్మకంగా

డిసెంబర్ రెండో వారంలో టిటిడి ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ విధానంతో సామాన్యులకు నిరీక్షణ బాధలు త్పపవచ్చు. ప్రస్తుతం రూ.300గా ఉన్న ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు, తిరుమలకు కాలినడకన వస్తూ దివ్యదర్శనం టోకెన్లు తీసుకొనే యాత్రికులకు రెండు మూడు గంటల్లో స్రీవారి దర్శనం లభిస్తోంది.

 ఇదే విధానం భక్తులకూ

ఇదే విధానం భక్తులకూ

ఇదే విధానం సర్వ దర్శనం భక్తులకూ వర్తింప చేయనున్నారు. తిరుమలలోని 21 ప్రాంతాలతో పాటు కాలి నడక మార్గాల్లో 150 కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.

బార్ కోడింగ్ టోకెన్లు

బార్ కోడింగ్ టోకెన్లు

దివ్యదర్శనం టోకెన్ల తరహాలో బార్ కోడింగ్ టోకెన్లు ఉచితంగా ఇస్తారు. పారదర్శకత కోసం శ్రీవారి దర్శనం టోకెన్‌తో ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని నిర్ణయించారు.

 రెండు మూడు గంటల్లో దర్శనం

రెండు మూడు గంటల్లో దర్శనం

టోకెన్లు కేటాయించిన సమయానికి వైకుంఠం 2 ముఖద్వారం వద్దకు చేరుకుంటే ఆలయంలోకి అనుమతిస్తారు. వీరికి రెండు మూడు గంటల్లో దర్శనం అవకాశం ఉంటుంది. లడ్డూలకు టోకెన్ అంద చేయనున్నారు. ఆధార్ తీసుకు రాకుంటే ప్రస్తుతం అమలవుతున్న విధానంలో దర్శించుకోవాల్సి ఉంటుంది.

English summary
Tirumala Tirupati Devasthanams plans for fast Darshan for devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X