కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి..

ఏడుకొండల వాడి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నారు, గతంలో ఎన్నడూ లేని విధంగా 2025-26లో అద్భుతమైన నిర్వహణ సాగింది. పక్కా ప్రణాళిక, అధునాతన సాంకేతికతను మేళవించడంతో అటు భక్తుల రద్దీని నియంత్రించడంలోనూ, ఇటు ఆదాయాన్ని పెంచడంలోనూ తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం విజయవంతమైంది.

గత రెండేళ్లుగా రోజుకు సగటున 70 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్య 73 వేలకు చేరింది. అంటే సుమారు 4.57 శాతం వృద్ధి నమోదైంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో పది రోజుల వ్యవధిలోనే గతంతో పోలిస్తే అదనంగా 1.40 లక్షల మందికి దర్శనం కల్పించడం విశేషం. ఏఐ (Artificial Intelligence) ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూలైన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, కంపార్ట్‌మెంట్ల వెయిటింగ్ సమయాన్ని బట్టి డైనమిక్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల సామాన్య భక్తులకు దర్శన సమయం గణనీయంగా తగ్గింది.

Tirumala TTD Records High Growth in 2025-26 Hundi Income Crosses Rs 1420 Crore Amid AI Tech Implementation

హుండీ ఆదాయంలో కాసుల వర్షం..

సాధారణంగా తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ఒకటి రెండు నెలలు మాత్రమే హుండీ ఆదాయం రూ.120 కోట్లు దాటేది. కానీ, ఈ ఏడాది వింతగా ఏకంగా ఆరు నెలల పాటు ప్రతి నెలా రూ.120 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించింది. ఏడాది మొత్తం మీద హుండీ కానుకలు రూ.1420 కోట్లు దాటి సరికొత్త రికార్డు సృష్టించాయి. స్వామివారి పట్ల భక్తులకున్న అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం.

దళారీ వ్యవస్థకు చెక్.. వసతిలో పారదర్శకత..

తిరుమలలో గదుల కేటాయింపులో ఏళ్ల తరబడి సాగుతున్న దళారీ వ్యవస్థకు తితిదే చెక్ పెట్టింది. "దర్శనం ఉంటేనే గది" అనే నిబంధనను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కఠినంగా అమలు చేయడంతో బ్లాక్ మార్కెట్ దందాకు బ్రేక్ పడింది. దీనివల్ల సామాన్య భక్తులకు గదులు త్వరగా అందుబాటులోకి రావడమే కాకుండా, వసతి విభాగం ఆదాయం కూడా రూ.133 కోట్ల నుంచి రూ.141 కోట్లకు పెరిగింది.

ఏఐ టెక్నాలజీతో.. మరింత రుచిగా లడ్డూ!

శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతలో తితిదే విప్లవాత్మక మార్పులు తెచ్చింది. నెయ్యి ఇతర ముడిసరుకుల గ్రేడింగ్‌లో ఏఐ టెక్నాలజీని వాడుతుండటంతో లడ్డూ రుచి మరింత పెరిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తిని కూడా పెంచారు. గతేడాది 12.49 కోట్ల లడ్డూలు విక్రయించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 13.95 కోట్లకు (12.68 శాతం వృద్ధి) చేరింది. త్వరలో లడ్డూ కౌంటర్ల వద్ద యూపీఐ (UPI) పేమెంట్లను కూడా ప్రవేశపెట్టనున్నారు.

అన్నప్రసాదం.. అక్షయపాత్రే!

భక్తుల ఆకలి తీర్చే అన్నప్రసాద వితరణలోనూ వృద్ధి కొనసాగుతోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ద్వారా 2023-24లో రోజుకు 1.87 లక్షల మందికి ఆహారం అందించగా, 2025-26 నాటికి ఆ సంఖ్య ఏకంగా 2.85 లక్షలకు చేరింది. భక్తుల రద్దీ పెరుగుతున్నా, ఎక్కడా లోటు లేకుండా అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+