TTD: తిరుమల వెళ్తున్న భక్తులకు బిగ్ అప్డేట్ - అనూహ్య రద్దీ, ఇక నుంచి..!!
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వారాంతపు సెలవుల నేపథ్యం లో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండాయి. శ్రీవారి సర్వ దర్శన టోకెన్ల కోసం భూదేవి కాంప్లెస్ వద్ద భక్తులు బారులు తీరారు. దీంతో, పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు అమలు చేస్తోంది. దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
తిరుమల కొండ అంతా భక్తులతో నిండిపోయింది. వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి గోగర్భం డ్యామ్ వరకు క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 77,043 భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు నిండిపోవడంతో భక్తులను ఆక్టోపస్ భవనం నుంచి క్యూ లైన్‌లోకి అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు.

ఎక్కువ సమయం క్యూ లైన్లో నిలబడాల్సి రావటంతో భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలు, నీరు, పాలు అందిస్తున్నారు. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ తిరుమలకు భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. సహజంగా ఆగస్టు నెలకు వచ్చే సరికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంటుందని, అయితే ఈసారి అందుకు భిన్నంగా పాఠశాలల తిరిగి ప్రారభమయిన తర్వాత జూన్, జులై, ఆగస్టు నెలల్లో కూడా రద్దీ ఏమాత్రం తగ్గలేదు. ముందస్తుగా దర్శనం స్లాట్లు రిజర్వ్ చేసుకున్న వారితో పాటుగా సాధారణ క్యూ లైన్లలో దర్శనం కోసం వేచి చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో, భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇక.. దేశ వ్యాప్తంగా కొత్త ఫాస్టాగ్ విధానం అమల్లోకి రావటంతో.. తిరుమలకు వచ్చే వాహనాలకు తప్పని సరి చేసారు. అలిపిరి వద్ద ఫాస్టాగ్ ఫాస్ట్ టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంకు వారి సహకారంతో ఫాస్ట్ టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేసారు. ఫాస్ట్ టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్ట్ టాగ్ సౌకర్యాన్ని పొందిన తరువాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తున్నారు.












Click it and Unblock the Notifications