తిరుపతి రైల్వేస్టేషన్ కు మహర్థశ...రూ.400 కోట్లతో అభివృద్ది

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్ కు మహర్ధశ పట్టనుంది. గురువారం తిరుపతిలో పర్యటించిన రైల్వే జనరల్ మేనజర్ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ది కోసం భారీగా నిధులు కేటాయించడంతో ఇక తిరుపతి రైల్వేస్టేషన్ రూపురేఖలే మారిపోనున్నాయి.

తిరుపతి నగరంలోని రైల్వేస్టేషన్‌ను రూ.400 కోట్లతో అభివృద్ధి చేస్తామని రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. తిరుపతిలో పర్యటించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దక్షిణం వైపు 8 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తామన్నారు. తిరుపతిలో వెంకటేశ్వర, పళని థియేటర్ల దగ్గర రూ. 24 కోట్లతో ఆర్వోబీలు నిర్మిస్తామని రైల్వే జీఎం ప్రకటించారు. అలాగే ప్రస్తుత అవసరాలను బట్టి ఇంకా రైల్వేకు సంబంధించి ఏవైనా అత్యవసర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాల్సి వుంటే వాటిని కూడా ఈ నిధులతో పూర్తి చెయ్యొచ్చని అన్నారు.

Tirupathi Railway Station To Get Rs 4oo Crores fund

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tirupathi Railway Station To Get Worth Rs 4oo Crores Makeover Under Ministry of Railways “Station Redevelopment” Plan...announced by Railway GM Vinodkumar at his Tirupathi Tour.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి