చంద్రబాబు ఇలాఖాకు స్పెషల్ ట్రైన్..అక్కడి నుంచి..!!

సికింద్రాబాద్:తిరుమల శ్రీవారి భక్తులకు, అలాగే కర్ణాటకలోని అందమైన చిక్కమగళూరును సందర్శించాలనుకునే పర్యాటకులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది.తిరుపతి - చిక్కమగళూరు - తిరుపతి మధ్య కొత్త వీక్లీ రైలు సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

ముహూర్తం కుదిరింది: తొలి ప్రయాణం ఎప్పుడంటే?
ఈ కొత్త రైలు సర్వీస్‌లో భాగంగా, చిక్కమగళూరు నుండి తిరుపతికి జూలై 11, 2025న ఒక ప్రత్యేక ప్రారంభ వన్‌వే సర్వీస్ (రైలు నంబర్ 07424) మొదలవుతుంది.సాధారణ వారపు సర్వీసులు మాత్రం జూలై 17, 2025 నుండి తిరుపతి నుండి (ప్రతి గురువారం), అలాగే జూలై 18, 2025 నుండి చిక్కమగళూరు నుండి (ప్రతి శుక్రవారం) పరుగులు తీయనున్నాయి.

tirupati-chikkamagaluru-new-weekly-train-service-convenient-travel-for-devotees-and-tourists

మీ ప్రయాణం మరింత సుఖమయం:
రైలు నంబర్ 17423 తిరుపతి - చిక్కమగళూరు: ప్రతి గురువారం రాత్రి 9:00 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు చిక్కమగళూరు చేరుకుంటుంది.
రైలు నంబర్ 17424 చిక్కమగళూరు - తిరుపతి:ప్రతి శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు చిక్కమగళూరు నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 7:40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ప్రధాన స్టాప్‌లు ఇవే:
ఈ కొత్త రైలులో 2AC, 3AC, స్లీపర్,ఇంకా జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.అంటే, మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా, సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.ఈ రైళ్లు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట జంక్షన్, కుప్పం, బంగారపేట, వైట్‌ఫీల్డ్, కృష్ణరాజపురం, SMVT బెంగళూరు, చిక్‌బానవర్, తుమ్‌కూరు, టిప్టూర్, అర్సికెరే జంక్షన్, దవనూరు, కడూర్, బిసలేహళ్లి, సఖరాయపట్న వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతూ వెళ్తాయి. ఇకపై తిరుపతి నుండి చిక్కమగళూరు ప్రయాణం మరింత సులభతరం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+