ఆంధ్రాలో ఆ పార్టీ ఏజెంట్లకే అనుమతి, కౌంటింగ్ ఎఫెక్ట్, నాయకులకు షాక్ ఇచ్చిన ఈసీ !
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిపోవడంతో ఇప్పుడు కౌంటింగ్ కు రంగం సిద్దం అవుతోంది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ బాధ్యత రిటర్నింగ్ అధికారులదే అని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఆ జిల్లాల కలెక్టర్లు సంబంధిత అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో పలు పార్టీల నాయకులకు సంబంధిత అధికారులు షాక్ ఇచ్చారు.
ఇక సమస్యాత్మక కేంద్రాలుగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుని పోలింగ్ తరువాత గొడవలకు కేంద్ర బింధువు అయిన తిరుపతిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబందిత అధికారులతో సమావేశం నిర్వహించి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రిటర్నింగ్ అధికారులు, సహాయక రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు.

ప్రశాంతమైన వాతావరణంతో కౌంటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలని సంబందిత అధికారులకు సూచించారు. కేవలం ఎన్నికల అధికారుల గుర్తింపు పొందిన పార్టీల నాయకులు, వారి ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి రావడానికి అనుమతించాలని, గుర్తింపు లేని పార్టీలు, స్వతంత్ర పార్టీల అభ్యర్థుల తరపున పోటీచేసిన నాయకులు, వారి ఏజెంట్లు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన హాల్ లో ఉంటూ టీవీల్లో వాటిని పరిశీలించడానికి అవకాశం ఇవ్వాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు సూచించారు.
ఎన్నికల అధికారుల గుర్తింపు పొందిన పార్టీల ఏజెంట్లు, ఇతర పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియ జరిగే ప్రాంతంలోకి రావడానికి అనుమతి కోసం కౌంటింగ్ కు మూడు రోజుల ముందే అధికారులకు అర్జీలు సమర్పించుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. అధికారులు కౌంటింగ్ కేంద్రాలకు జూన్ 4వ తేదీన ఉదయం 7 గంటలకు ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, ఎవ్వరూ ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు రాకూడదని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, ఉదయం 8. 30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అధికారులు అన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. తిరుపతిలో ఈవీఎంలు భద్రపరిచితన శ్రీ పద్మావతి మహిళా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో ఇప్పటికే గొడవలు జరగడంతో జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో మరోసారి అలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి అధికారులు, పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications