తిరుపతి ఉపఎన్నిక ఫలితాలు: వైసీపీ అభ్యర్థి గురుమూర్తి భారీ విజయం, 2 లక్షలకుపై మెజార్టీ
చిత్తూరు: తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి భారీ విజయాన్ని నమోదు చేశారు. 2,31,943 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2019లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించిన 2.28 ఓట్ల మెజార్టీని అధిగమించి గురుమూర్తి విజయం సాధించారు.
ఉపఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తికి 5,37,152 (56.5 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఇక టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,05,209 (32.1 శాతం) ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50,739 (5.3శాతం), కాంగ్రెస్ అభ్యర్థికి 8,477 (0.9 శాతం) ఓట్లు వచ్చాయి. సీపీఎం 5027 (0.5శాతం), ఇతరులకు 30,704(3.2 శాతం) ఓట్లు రాగా, నోటాకు 13,300 (1.4శాతం) ఓట్లు పోలవడం గమనార్హం.

మారుమూల గ్రామం నుంచి లోక్‌సభకు..
చిత్తూరు జిల్లా ఏర్పాడు మండలంలోని మారుమూల గ్రామమైన మన్నసముద్రం దళితవాడకు చెందిన మద్దిల గురుమూర్తి మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి మునికృష్ణయ్య ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల భూమిలో మామిడి సాగు చేస్తున్నారు. తల్లి రమణమ్మ గృహిణి. గురుమూర్తికి ఐదుగురు అక్కా చెల్లెల్లు ఉన్నారు.
ఐదో తరగతి వరకు మన్నసముద్రంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆరు నుంచి 10వ తరగతి వరకు పక్కనే ఉన్న బండారుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివారు. ఆ తర్వాత ఇంటర్ తిరుపతిలో చేశారు. అనంతరం స్విమ్స్‌లో ఫిజియోథెరపీ పూర్తి చేశారు.
ఆ సమయంలోనే దివంగత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ తర్వాత 2017లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో గురుమూర్తి ఆయనే వెంటే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్న గురుమూర్తిని తిరుపతి ఉపఎన్నిక బరిలో నిలిపి గెలిపించారు.












Click it and Unblock the Notifications