తిరుమలకు కార్లలో వెళ్తున్నారా ? పోలీసుల కీలక సూచనలు..!
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడనుంచో వచ్చే భక్తులకు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ కీలక సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా కార్లు దగ్ధమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీంతో వాహనాలు నడిపేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ పలు సూచనలు చేశారు. వీటిని తిరుమలకు కార్లలో వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు కోరుతున్నారు.
ఇటీవల ఎండాకాలం లో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయని, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయన్నారు ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే పలు కారణాలు చెప్పారని, కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. తిరుమల ఘాట్ రోడ్డులో 500 కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు ఎక్కువ వేడెక్కడం లేదా మంటలు అంటుకోవడం, కొన్ని మెకానికల్ సమస్యలు, పర్యావరణ పరిస్థితులు, డ్రైవింగ్ శైలుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు.

దీర్ఘదూర ప్రయాణం ఇలా కార్లు దగ్ధం కావడానికి కారణమవుతోందని పోలీసులు తెలిపారు. సుమారు 500కిమీ ప్రయాణం తర్వాత ఇంజిన్ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుందని,తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్, ట్రాన్స్‌మిషన్‌కు అధిక వేడి వస్తుందని తెలిపారు. అలాగే కొండలు, వంకర రోడ్లు ఎక్కాలంటే అధిక ఇంజిన్ శక్తి అవసరమన్నారు. డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారని,దీంతో ఆర్పీఎం పెరిగి వేడి పెరుగుతుందన్నారు.
దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుందన్నారు.
అలాగే అధిక లోడ్ తో వెళ్లే వాహనాలు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు. తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణమని, ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుందన్నారు. అలాగే పాత వాహనాలు, సరిగా సర్వీస్ చేయని వాహనాలలో కూలంట్ లీక్‌లు , తక్కువ స్థాయి కూలంట్ ఉండటం, పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు, థెర్మోస్టాట్ లోపాలు, పాడైన ఇంజిన్ ఆయిల్ కారణంగా కూడా ప్రమాదాల అవకాశం ఉందన్నారు. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయన్నారు.

అలాగే ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యల వల్ల కూడా కార్లు ప్రమాదాలకు గురవుతాయన్నారు. ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పుటించవచ్చన్నారు. దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు, వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయన్నారు. అలాగే కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తానని, దీని వలన ఫ్యాన్ పని చేయదన్నారు. వేడి బయటకు వెళ్లదని, ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చన్నారు.
కాబట్టి టూర్ కు బయలుదేరే ముందు బండిని సర్వీసింగ్ చేయించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, ఏసీ ఆయిల్ తనిఖీచేయించాలన్నారు. అలాగే రేడియేటర్ లీకేజీ తనిఖీచేయడం, ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం, బ్యాటరీ లో డిస్టిల్ వాటర్ తనిఖీచేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తుప్పు కడిగించుకోవడం చేయాలన్నారు. డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి అయిదు నిమిషాల పాటు నడక చేయడం, స్వల్ప వ్యాయామం చేయడం, బాగా మంచినీరు తీసుకోవడం, టి, అల్పాహారం సేవించడం చేయాలన్నారు.
అలాగే సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వాహన డ్యాష్ బోర్డు మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండాలన్నారు. ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు. ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలు వాహనాన్ని విశ్రాంతి ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎక్కే సమయంలో ఏసీ ఆఫ్ చేయాలని కూడా సూచిస్తున్నారు. కూలంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేసుకోవాలని కోరుతున్నారు. బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడమని సూచిస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications