ప్రాయశ్చిత్త దీక్ష లేదా పవనూ

Botcha Satyanarayana: తిరుపతిలో ఆరుమంది భక్తుల ప్రాణాలను బలి తీసుకున్న తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయకుడు, శాస‌న‌ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఏర్పడిన తరువాత తిరుమల ప్రతిష్టపై మసకబారుతుతోందని, టీటీడీ పరిపాలన పట్ల భక్తుల్లో నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు.

Tirupati Stampede Botcha Satyanarayana demand for Judicial inquiry

టీటీడీ ఛైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెబుతున్నారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని బొత్స నిలదీశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.

పవన్‌ కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తులు ప్రాణాలు తిరిగి రావని, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావుడి చేసిన పవన్‌ కళ్యాణ్ ఇప్పుడెందుకు క్షమాపణలు చెప్పేసి ఊరుకున్నారని అన్నారు.

టీటీడీ ఛైర్మన్, ఈఓ ప్రెస్‌మీట్‌ పెట్టి క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ చెబుతున్నాడని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన వాళ్లు చేసిన పాపాలు కరిగిపోతాయా? పోయిన భక్తుల ప్రాణాలు తిరిగొస్తాయా?.. అని బొత్స సత్యనారాయణ అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష అంటూ హంగామా చేయడం కాదని, ఆరుమంద ప్రాణాలు పోయిన తరువాత క్షమాపణలు చెప్పి తప్పించుకోవద్దని అన్నారు.

Tirupati Stampede Botcha Satyanarayana demand for Judicial inquiry

తొక్కిసలాట ఘటనపై అధికారులను సస్పెండ్‌ చేసినంత మాత్రాన బాధితులకు న్యాయం జరిగినట్టు కాదని బొత్స అన్నారు. ఈ ఘటనను ఏపీ హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని చెప్పారు. పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని కోరారు.

తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించడానికి తిరుపతికి వచ్చిన వైఎస్ జగన్‌ను అడ్డుకోవడాన్ని బొత్స తప్పుపట్టారు. జగన్‌ పరామర్శకు వెళితే క్షతగాత్రులకు కవర్లు ఇచ్చి మాట్లాడించారని కూటమి పార్టీలు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+