ఏపీలో వానలు పడుతున్నాయి.. పోతున్నాయి!

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తర తీరానికి ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం తూర్పు జార్కండ్ పరిసరాల్లో ఉంది. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో జోరుగా వానలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. జై సల్మేర్, చురు, హిస్సార్, జలంధర్, కర్నాల్, తరంతరణ్ గుండా రుతుపవనాలు ప్రయాణం చేస్తున్నాయి.

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
ఏపీ కోస్తా, యానాంలో ఈ ప్రాంతాల్లో సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల చిన్న చిన్న జల్లులు పడతాయి. ఉరుములు, మెరుపులు రెండుచోట్ల అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉంటాయని వెల్లడించింది.

today and tomorrow weather updates in andhra pradesh and telangana states

దక్షిణ కోస్తా ఏపీలో మోస్తరు వానలు లేదంటే తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఉరుములు, మెరుపులు ఉంటాయికానీ ఆ స్థాయిలో వానలు పడవు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మంగళవారంనాడు తేలికపాటి జల్లులు పడతాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది.

ఉరుములు, మెరుపులతో జల్లులు
రాయలసీమలో సోమవారం మోస్తరు వర్షాలు కురుస్తాయి. లేదంటే ఉరుములతో జల్లులు పడతాయి. అలాగే మరికొన్ని చోట ఉరుములు, మెరుపులతో జల్లులు కురవనున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం రోజు ఒకటి రెండు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులకు మాత్రం రెండు చోట్ల అవకాశం ఉంది. తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈదురు గాలులతో అతి భారీ వర్షాలు కురియనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+