వైఎస్ జగన్ కు శుభవార్త!
హమూన్ తుఫాన్ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ సమీపంలో బుధవారం ఉదయం తీరం దాటింది. గంటకు 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగ్లాదేశ్, మిజోరం వైపు పయనిస్తోంది. ఈశాన్య దిశగా కదిలి అల్పపీడనంగా రూపాంతరం చెందినట్లు వాతావరణశాఖ గుర్తించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటున సముద్రమట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
గురువారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. పార్వతీపురంలో 28.4 మిల్లీ మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 24.2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో 10.6, కొమరాడలో 6.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.

గత మూడు నెలల నుంచి ఏపీలో ఆశించిన రీతిలో వర్షాలు కురవడంలేదు. పగటివేళ ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నడి వేసవిలో ఉన్నట్లుగా ప్రజలు భావిస్తున్నారు. అక్కడక్కడా చిరు జల్లులు మినహా సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. పగలు ఎండలు, రాత్రి చలితో భిన్నమైన వాతావరణం నెలకొంది. వాయుగుండం, తుఫాన్ కారణంగా రాష్ట్రంలో వానలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేయడంతో రాష్ట్ర ప్రభుత్వం సంతసిస్తోంది.












Click it and Unblock the Notifications