ఆయన ఇక్కడ...ఈయన అక్కడ...ఎపిలో నేటి రాజకీయ విచిత్రం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు ఒక చిత్రం చోటు చేసుకుంది. ఒకరకంగా 2018 నూతన సంవత్సరం ఆరంభంలో ఇదే తొలి రాజకీయ విచిత్రం గా అభివర్ణించవచ్చు...అదేమిటంటే...
ఎపి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన ప్రత్యర్థి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో సాగుతుంటే మరోవైపు సిఎం చంద్రబాబు నాయుడు జన్మభూమి కార్యక్రమం కోసం ప్రతిపక్ష నేత జగన్ స్వస్థలం పులివెందుల లోఅడుగుపెట్టారు.
ఇక్కడ చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు వైఫల్యాలను జగన్ ఎండగడుతుంటే, అక్కడ పులివెందులలో జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శనాస్త్రాలను సంధించారు.

అక్కడ సిఎం చంద్రబాబు...
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా ఉండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందుల, కడప జిల్లాలకు చెయ్యలేని పనులను తాను చేస్తున్నానని అన్నారు. 2019లో పులివెందులలో టిడిపి గెలవాలనే ధ్యేయంతో చంద్రబాబు ఇటీవల కాలంలో కడప జిల్లాలో తన పర్యటనల సంఖ్యను పెంచినట్లు తెలుస్తోంది.

పులివెందులలో చంద్రబాబు...
ఒకవైపు జగన్ చిత్తూరు జిల్లా ప్రజాసంకల్ప యాత్రలో చంద్రబాబు పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు వచ్చి తాను చేస్తున్నఅభివృద్ధి గురించి వివరించి చెప్పడం ఒక విశేషం గా చెప్పుకోవచ్చు. చంద్రబాబు పులివెందులలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి హాజరయ్యారు.

సిఎం సొంత జిల్లాలో జగన్...
ఇక ఇక్కడ ప్రతిపక్షనేత జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు 51వ రోజుకి చేరుకుంది. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా జమ్మిలవారిపల్లి నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. తెలుగుదేశం వైఫల్యాలను, ప్రజలకు జరుగుతున్నఅన్యాయాలను విమర్శించడమే ఆయన తన ప్రజాసంకల్పయాత్రలో ప్రధాన ఎజండాగా పెట్టుకున్నారు. అలాగే జగన్ తాను ముఖ్యమంత్రి అయితే ఏమి చేస్తాడో ఆ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. సిఎం సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి చేయలేదని, అందుకే తన యాత్రకు ప్రజల వివరీతంగా వస్తున్నారని, వారంతా మార్పు కోరుతున్నారని జగన్ చెప్పుకొస్తున్నారు.

ఇదే నేటి రాజకీయ విచిత్రం...
ఒకవైపు ప్రతిపక్షనేత ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఆయన మీద తీవ్ర విమర్శలు చేస్తుండటం, అదే సమయంలో మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షనేత జగన్ సొంత నియోజకవర్గంలో పర్యటించి జగన్ పై విమర్శలు గుప్పించడం ఒకే రోజు చోటు చేసుకోవడం ఇక చిత్రమైతే అవి రెండు కొత్త సంవత్సరం ఆరంభంలోనే చోటు చేసుకోవడం మరో విచిత్రంగా అభివర్ణించవచ్చు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications