వైయస్ జగన్ వెంట నడిచిన సినీ నటుడు ఫిష్ వెంకట్
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ నటుల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ నటుడు జగన్ పాదయాత్రకు మద్దతునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, మరో సినీ నటుడు ఫిష్ వెంకటన్ జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు.
పాదయాత్ర చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఫిష్ వెంకట్ ఆయనకు సంఘీభావం తెలిపారు. కాగా, 265వ రోజైన మంగళవారం ఉదయం వైయస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు.

మార్గమధ్యలో వెంకట్.. వైయస్ జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు.. కొంత దూరం వరకు ఆయన వెంట నడిచారు. వైయస్ జగన్ రాకతో అక్కడికి ప్రజలంతా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాగా, ఇప్పటికే పోసాని మురళీకృష్ణ, పృథ్వీ తదితర సినీ నటులు ఇప్పటికే జగన్‌కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications