చంద్రబాబుపై బండ్ల గణేష్ సెటైర్లు మామూలుగా లేవుగా..!!

అమరావతి: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తుల కోసం ప్రయత్నాలు సాగిస్తోన్నారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం ఢిల్లీకీ వెళ్లారు. రాత్రి 8:30 గంటల సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు.

ముందస్తు ఎన్నికలతో పాటు ఏపీలో నెలకొన్న తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చాయి. ప్రత్యేకించి బీజేపీతో కలిసి ముందుకెళ్లాలనే తన అభీష్టాన్ని చంద్రబాబు వారికి తెలిపారు. తమతో పొత్తు పెట్టుకుని సార్వత్రిక ఎన్నికల్లో కలిసి రావడానికి అంగీకరించితే ఎనిమిది లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలను ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ చంద్రబాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

 bandlaganeshchandrababunaidu

ఇక తెలంగాణలో బేషరతుగా మద్దతు ఇస్తానని కూడా చంద్రబాబు ప్రతిపాదించారని చెబుతున్నారు. దీనిపై అమిత్ షా గానీ, జేపీ నడ్డా గానీ టీడీపీతో పొత్తుపై అప్పటికప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేదు. పొత్తు చర్చలు సానుకూల వాతావరణం ముగిశాయని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. మరోదఫా చంద్రబాబు- బీజేపీ నేతలను కలుసుకుంటారని స్పష్టత ఇస్తోంది.

నిజానికి- తన ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు ప్రధాని మోదీని కూడా కలవాల్సి ఉంది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లాకు బయలుదేరి వెళ్లారు మోదీ. దీనితో మోదీ-చంద్రబాబు మధ్య భేటీ సాధ్యపడలేదు. మలి విడత ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మోదీని కలుస్తారనీ చెబుతోంది తెలుగుదేశం పార్టీ.

 bandlaganesh

బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న చంద్రబాబుపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సెటైర్లు సంధించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన. చంద్రబాబు పేరు ఎక్కడా పొందుపర్చలేదు. ఖర్మ కాకపోతే ఇంకేంటి.. అంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఆయన సీపీఎం అంటే సీపీఎం అనాలి బీజేపీ అంటే బీజేపీ అనాలి, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలి. జనసేన అంటే జనసేన అనాలి అని ఎద్దేవా చేశారు.

ఆయన కన్వీనెంట్‌గా ఏ పేరు చెప్తే దాన్ని అందరు ఫాలో అవ్వాలి.. అంతేగాని ఎవరికీ ఆత్మభిమానం, మంచి చెడు, మానవత్వం ఉండదు. ఆయన పొగిడితే జాతిని పోగిడినట్టు లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టు ఇంతకంటే ఏం కావాలి, దరిద్రం.. అంటూ తన ట్విట్టర్ పోస్ట్‌కు కంక్లూజన్ ఇచ్చారు బండ్ల గణేష్. చంద్రబాబు, ఆయన అనుసరిస్తోన్న రాజకీయ విధానాలను ఉద్దేశించే ఆయన ఈ పోస్ట్ చేశారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+