సినిమా టిక్కెట్ వర్సెస్ టమాట : ఏపీ ప్రభుత్వంపై యువ హీరో సెటైర్ : చిరంజీవి- బాలయ్య సైతం..!!
ఏపీ ప్రభుత్వం తాజాగా సినీమాటోగ్రఫీ చట్టంలో మార్పులు చేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా ఇక నుంచి ఆన్ లైన్ టిక్కెట్ల విక్రయానికి లైన్ క్లియర్ అయింది. దీంతో పాటుగా బెనిఫిట్ షో లకు అనుమతి లేదని..నాలుగు షో లు మాత్రమే నడపాలని ప్రభుత్వం నిర్దేశించింది. అదే విధంగా సినిమా టిక్కెట్ల ధరలు ఒకే విధంగా అమలు చేయాలని డిసైడ్ అయింది. సినిమా టిక్కెట్ల ధరల పైన ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఈ విషయం పైన పునరాలోచన చేయాలంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు.

చిరంజీవి అప్పీల్
దీంతో..చిరంజీవి తో పాటుగా పరిశ్రమ పెద్దలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని..సీఎంకు నివేదించి...నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేసారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం అన్ని సినిమాలకూ ఒకే టికెట్ రేట్ పెట్టడం సరికాదని, దానివల్ల పెద్ద సినిమాలు నష్టపోతాయని, ప్రభుత్వం తమ నిర్ణయం గురించి మరోసారి పునరాలోచించాలని కోరారు. ఇక, ఇప్పుడు యంగ్ హీరో నవదీప్ చేసిన ట్వీట్ అటు సినీ ఇండస్ట్రీలో..ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. నవదీప్ ప్రభుత్వంపై ఈ సెటైర్‌ను పోస్ట్ చేసారు.

నవదీప్ సెటైరికల్ ట్వీట్
ఏపీ ప్రభుత్వం అని చెప్పకుండా తాను చెప్పదలచుకున్నది చెప్పారు. సినిమా టిక్కెట్ వర్సెస్ టమాట అంటూ ట్వీట్ చేసి చర్చకు వదిలేసారు. దీని పైన రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కిలో టమాటో రూ వందకు పైగా పలుకుతోంది. సినిమా టిక్కెట్ ధర అంత కూడా లేదని చెప్పటం నవదీప్ ఉద్దేశం గా ఉందనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ. అదే సమయంలో టమోటా రేట్లు కంట్రోల్ చేయకుండా సినిమా టిక్కెట్లు నియంత్రించటం ఏంటనే విధంగా ఆ ట్వీట్ ఉందననేది మరో చర్. నవదీప్ అందులో ఏపీ ప్రభుత్వం పేరు... ఎవరిని ఉద్దేశించి చేస్తోందీ అందులో ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు.
Recommended Video

బాలయ్య అభ్యర్ధన
ఇక, తాజాగా అఖండి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా టిక్కెట్ల ధరల పైన హీరో బాలక్రిష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలో పుష్ఫ..చిరంజీవి నటించిన ఆచార్య...జూ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదల అవుతున్నాయని...సినిమాలు బాగా నడిచేలా ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. ఈ సినిమాలు వచ్చే సంక్రాంతి సమయంలో విడుదల కానున్నాయి. అయితే, ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి నాని తాను సీఎంతో చర్చిస్తానని చెప్పినా..అందుకు టైం అన్నది స్పష్టత ఇవ్వలేదు. ఇక, ఇప్పుడు నవదీప్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications