హైదరాబాద్‌కు హరికృష్ణ పార్థీవ దేహం: అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: నార్కట్‌పల్లి వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీనటుడు, టీడీపీ సీనియర్ నేత హరికృష్ణ భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించారు. నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో హరికృష్ణ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఇందుకోసం నల్గొండ ప్రభుత్వాస్పత్రి నుంచి వైద్యుల బృందం కామినేనికి వచ్చింది.
పోస్టుమార్టం అనంతరం హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు. హరికృష్ణ భౌతికకాయం వెంట బాలకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఉన్నారు. హరికృష్ణ పార్థివదేహం వెంట ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ బయల్దేరారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు..
Recommended Video

మొయినాబాద్ మండలం ముర్తుజగూడలోని నందమూరి కుటుంబసభ్యుల వ్యవసాయక్షేత్రంలో రేపు(గురువారం) హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications